పెళ్లి పీటలు ఎక్కుతోన్న హనుమాన్ హీరో.. వధువు ఎవరంటే
ABN, Publish Date - Oct 20 , 2026 | 04:16 PM
పండగ పూట తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం ఒకెత్తు అయితే, మరోవైపు టాలీవుడ్ హీరోల పెళ్లి వార్తలతో సోషల్ మీడియా ఒక్కసారిగా షేక్ అవుతోంది.
పండగ పూట తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం ఒకెత్తు అయితే, మరోవైపు టాలీవుడ్ హీరోల పెళ్లి వార్తలతో సోషల్ మీడియా ఒక్కసారిగా షేక్ అవుతోంది. ఇప్పట్టికే మెగా హీరో సాయి దుర్గా తేజ్ వివాహం నవంబరులో జరగనుందన్న వార్తలు వైరల్ అవుతుండగా, తాజాగా టాలీవుడ్‌లో మరో యువ హీరో పెళ్లి పీటలెక్కిబోతున్నాడనే వార్త హాట్ టాపిక్‌గా మారింది.
బాలనటుడిగా ఇండస్ట్రీకి పరిచయమై వెండితెరపై వరుస పాన్ ఇండియా విజయాలతో సూపర్ ఫామ్‌లో ఉండి, ఈమధ్యే ఓటీటీలోనూ రియాలిటీ షోతో అడుగుపెట్టిన యువ హీరో తేజా సజ్జా పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. హను-మాన్, మిరాయ్ వంటి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించిన ఈ సూపర్ హీరో నిజ జీవితంలోనూ ఓ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించడానికి సిద్ధమయ్యాడు.
ఈ పెళ్లికి సంబంధించిన ముస్తాబులు ఇప్పటికే మొదలైనట్లు ఫిలిం నగర్ వర్గాల ద్వారా తెలుస్తోంది. వచ్చే నెల నవంబర్ లో తేజా సజ్జా నిశ్చితార్థం అత్యంత వేడుకగా జరగనుంది. ఆ తర్వాత డిసెంబరులో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఈ వివాహం అత్యంత వైభవంగా జరగబోతోంది.ఇది పూర్తిగా పెద్దలు కుదిర్చిన వివాహం అని సమాచారం. ఈ పెళ్లికి సంబంధించిన విశేషాల్లో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, వధువు ఒక ప్రొఫెషనల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఈ పెళ్లి కూతురు కుటుంబానికి, సినిమా రంగానికి అసలు ఎలాంటి సంబంధం లేదట. పూర్తిగా గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉండే ఓ సాధారణ సాఫ్ట్‌వేర్ అమ్మాయితో తేజా సజ్జా ఏడడుగులు నడవనున్నాడు.
సినిమాలతో పాటు డిజిటల్ వేదికలపై కూడా సందడి చేస్తున్న తేజ సజ్జా త్వరలోనే ఈ శుభవార్తను అధికారికంగా తన అభిమానులతో పంచుకోబోతున్నాడు. దసరా పండగ వేళ టాలీవుడ్‌లో వరుసగా వస్తున్న ఈ పెళ్లి వార్తలతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. త్వరలోనే ఈ యువ హీరో పెళ్లికి సంబంధించిన పూర్తి వివరాలు, తేదీలు అధికారికంగా వెల్లడవుతాయని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.