సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

హన్సి ప్రొడక్షన్స్ తొలి సినిమా షురూ  

ABN, Publish Date - Feb 28 , 2026 | 07:00 PM

జగన్ యోగిరాజ్, నవ్య చిట్యాల జంటగా హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్ పై  నూతన చిత్రం శనివారం ప్రారంభమైంది.

జగన్ యోగిరాజ్, నవ్య చిట్యాల జంటగా హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్ పై  నూతన చిత్రం శనివారం ప్రారంభమైంది. రఘు వర్ధన్ కోట్ల దర్శకత్వంలో శ్రీ హన్సిక పెద్దిరెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పూజ కార్యక్రమాల అనంతరం ముహూర్తపు సన్నివేశానికి  శ్రీధర్ పెద్దిరెడ్డి క్లాప్ కొట్టారు. స్రవంతి  పెద్దిరెడ్డి కెమెరా  స్విచ్ ఆన్  చేయగా, శ్రీ హన్సిక పెద్దిరెడ్డి దర్శకుడికి స్క్రిప్ట్ ను అందజేశారు.

నిర్మాత శ్రీ హన్సిక పెద్దిరెడ్డి మాట్లాడుతూ 'సినిమా అనేది నాకు ఒక కల. ఒక అభిరుచి. ఒక బాధ్యత. అదే ప్రేమతో ఇప్పుడు చిత్ర నిర్మాణంలో అడుగుపెడుతున్నాను. హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నా తొలి చిత్రాన్ని అత్యంత ప్రెస్టేజీయస్‌గా  నిర్మిస్తున్నాం.  మా మొదటి ప్రాజెక్ట్ ఒక అందమైన ఎంటర్‌టైన్‌మెంట్ లవ్ డ్రామా. ప్రేమ, భావోద్వేగాలు, వినోదం ఈ మూడు ఎలిమెంట్స్‌తో  ప్రేక్షకులను అలరించేలా ఈ కథను ఎంపిక చేసుకున్నాం. ప్రతి యువకుడి మనసుకు దగ్గరయ్యే భావాలు, ప్రతి కుటుంబం ఆస్వాదించే వినోదం ఈ చిత్రంలో ఉంటాయి. మంచి కథకు ప్రాధాన్యం ఇస్తూ, టెక్నికల్‌గా ఉన్నత ప్రమాణాలతో, నాణ్యమైన నిర్మాణ విలువలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. ఈ చిత్రం  నిర్మాతగా తొలి అడుగు మాత్రమే కాదు, భవిష్యత్తులో మరెన్నో మంచి, అర్థవంతమైన చిత్రాలకు  పునాది అవుతుందని నమ్ముతున్నాను' అని అన్నారు.  త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్లు  దర్శకుడు రఘు వర్ధన్ కోట్ల తెలియజేశారు.   

Updated Date - Feb 28 , 2026 | 07:02 PM