Haindava Teaser: విగ్రహాల దొంగతనం.. దేవుడు ఏం చేస్తున్నాడు
ABN, Publish Date - Oct 14 , 2026 | 06:58 PM
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas) చాలా గ్యాప్ తరువాత నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ప్యాక్డ్ మూవీ హైందవ(Haindava).
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas) చాలా గ్యాప్ తరువాత నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ప్యాక్డ్ మూవీ హైందవ(Haindava). లూధీర్ బైరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్గా నటించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, స్పెషల్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా భారీ అంచనాలను పెంచేశాయి. తాజాగా ఈ సినిమా టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. దేవుళ్లు, నమ్మకాలు, ఆచారాలు, విగ్రహాల అదృశ్యం వంటి పవర్ టెల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఈ టీజర్ కట్ ఆకట్టుకుంటోంది.
రంగాపురం అనే గ్రామంలో దేవుని విగ్రహాలు మాయమవుతాయి. దాంతోపాటూ సడెన్ గా మనుషులు హత్యకు గురవుతారు. ఇదంతా దేవుని ఆగ్రహం అని ప్రజలు భయపడుతుంటారు. ఇక ఈ కేసులను చేధించడానికి దేవుడంటే నమ్మకం లేని పోలీస్ గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కనిపించాడు. ఆ ఊర్లో విగ్రహాలను కొట్టేసింది ఎవరు.. ? ఆ విగ్రహాలలో ఏముంది.. ? పుష్కర సమయానికి గుడిలో విగ్రహాలు ఎలా వస్తాయి.. ? అనేది సినిమా చూసి తెల్సుకోవాల్సిందే.
ఈ మధ్య ఇండస్ట్రీలో దేవుళ్ళ కథలు ఎక్కువగా హిట్స్ అందుకుంటున్న విషయం తెల్సిందే. సాయి శ్రీనివాస్ కూడా ఇప్పుడు ఆ దేవుడినే నమ్ముకున్నాడు. విగ్రహాల మిస్సింగ్ మిస్టరీ.. ఇన్వెస్టిగేషన్ ఇలా వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో టీజర్ ఆకట్టుకోవడమే కాకుండా అంచనాలను పెంచేశాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన బాడీ లాంగ్వేజ్ అండ్ ఇంటెన్స్ యాక్టింగ్‌తో మరోసారి మాస్ ఆడియన్స్‌ను ఫిదా చేసేలా కనిపిస్తున్నాడు. సంయుక్త పాత్ర కూడా చాలా కీలకమైనదిగా తెలుస్తోంది. సామ్ సి.ఎస్ అందించిన నేపధ్య సంగీతం ఈ టీజర్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది. విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్ అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. ఇక ఈ సినిమా నవంబర్ 27 న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మరి ఈ సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.