Haiku: ‘హైకూ’ పనులన్నీ.. జెట్ స్పీడ్‌లో..
ABN, Publish Date - Jun 26 , 2026 | 05:35 PM
‘కోర్ట్’ సినిమాలో ఫేమ్ శ్రీదేవి నటిస్తున్న తాజా చిత్రం ‘హైకూ’. ఏగన్, ‘మిన్నల్ మురళి’ మూవీ ఫేమ్ ఫెమినా జార్జ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
‘కోర్ట్’ సినిమాలో ఫేమ్ శ్రీదేవి నటిస్తున్న తాజా చిత్రం ‘హైకూ’. ఏగన్, ‘మిన్నల్ మురళి’ మూవీ ఫేమ్ ఫెమినా జార్జ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై డా. డి. అరుళానందు, మాథేవో అరుళానందు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యువరాజ్ చిన్నసామి దర్శకత్వం వహిస్తున్నారు. నాలుగు షెడ్యూళ్లలో 90 రోజుల చిత్రీకరణతో మొత్తం షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. చిత్రీకరణ పూర్తయ్యేలోపే సినిమా పోస్ట్-థియేట్రికల్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోవడం విశేషం.
చిన్నసామి మాట్లాడుతూ 'హైకూ’ సినిమాను అనుకున్న ప్లానింగ్ ప్రకారం పూర్తి చేశాం. మా ఎంటైర్ టీమ్‌కు చాలా ఎమోషనల్, హ్యాపీ మూమెంట్ ఇది. కథను నమ్మి నాకు పూర్తి క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చిన మా నిర్మాతలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. సినిమా బాగా వచ్చింది. ‘హైకూ’ సినిమాను హృదయానికి హత్తుకునేలా, భావోద్వేగమైన చిత్రంగా, ప్రేక్షకులకు మంచి థియేట్రికల్ ఫీల్‌నిచ్చే మూవీలాగా రూపొందిస్తున్నాం. విజన్ సినిమా హౌస్ భవిష్యత్తులో చాలా మంది యువ దర్శకులకు చక్కటి వేదికగా మారుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను’ అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ, ‘హైకూ’ సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. కథపై డైరెక్టర్‌కు ఉన్న స్పష్టత, మేకింగ్‌లో తను చూపిన నిజాయితీ, క్రమశిక్షణతో సినిమా ఔట్‌పుట్ చాలా బాగా వచ్చింది. సినిమాలోని ఎమోషన్స్ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అవుతాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం అన్నారు.