సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

గిన్నిస్ రికార్డ్ సాధించిన రాకా.. భారతీయ సినిమా చరిత్రలోనే మొదటిసారి

ABN, Publish Date - Sep 21 , 2026 | 07:18 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రం రాకా. సన్ పిక్చర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ఈ సినిమా భారతీయ సినిమా చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా ఒక విప్లవాత్మక ప్రపంచ రికార్డును నెలకొల్పింది.

Raaka

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), తమిళ తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రం రాకా (Raaka). సన్ పిక్చర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ఈ సినిమా భారతీయ సినిమా చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా ఒక విప్లవాత్మక ప్రపంచ రికార్డును నెలకొల్పింది. విజువల్ ఎఫెక్ట్స్ రంగంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ, అత్యంత అడ్వాన్స్డ్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ద్వారా ఏకంగా 37 మంది పర్‌ఫార్మర్లను ఒకేసారి రియల్ టైమ్‌లో క్యాప్చర్ చేసి ఈ సినిమా బృందం గ్లోబల్ లెవెల్‌లో సంచలనం సృష్టించింది.


ఇక ఈ అపూర్వ ఘనతకు గానూ రాకా సినిమాకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దొరికింది. ఈ అధికారిక సర్టిఫికేట్‌ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీలకు అందజేశారు. మోస్ట్ పీపుల్ మోషన్-క్యాప్చర్డ్ ఇన్ రియల్-టైమ్ అనే విభాగంలో ఈ అరుదైన రికార్డు నమోదు కావడంతో ఇండియన్ సినీ ప్రియులు, బన్నీ ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పుతూ, ఇండియన్ సినిమా స్టాండర్డ్స్‌ను ప్రపంచ వేదికపై సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లిన ఈ ప్రయోగంపై సోషల్ మీడియాలో నెటిజన్లు, ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. హాలీవుడ్ స్థాయి టెక్నాలజీతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇండియన్ విజువల్ వండర్‌గా నిలవడం ఖాయమని సినీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.


ప్రస్తుతం అల్లు అర్జున్ గిన్నిస్ రికార్డ్ సర్టిఫికేట్ అందుకన్న ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ చారిత్రాత్మక విజయంతో రాకా చిత్రంపై అంచనాలు పాన్-ఇండియా స్థాయి నుంచి గ్లోబల్ రేంజ్‌కు పెరిగిపోయాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని భారీ అప్‌డేట్స్‌ను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమతో బన్నీ ఎలాంటి రికార్డులు బద్దలుకొడతాడో చూడాలి.

Updated Date - Sep 21 , 2026 | 07:21 PM