సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Padma Awards 2026: మ‌మ్ముట్టికి ప‌ద్మ భూష‌ణ్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, ముర‌ళీ మోహ‌న్‌ల‌కు ప‌ద్మ‌శ్రీ

ABN, Publish Date - Jan 25 , 2026 | 06:37 PM

గ‌ణ‌తంత్ర దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని భార‌త ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌క అవార్డుల‌ను ప్ర‌క‌టించింది.

padma awards

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో సినీరంగం మెరిసింది. భారతీయ సినిమాకు వన్నె తెచ్చిన దిగ్గజాలకు కేంద్రం అత్యున్నత పురస్కారాలతో పట్టం కట్టింది. మొత్తంగా 113 మందికి ప‌ద్మ‌శ్రీ, 13 మందికి ప‌ద్మ‌భూష‌ణ్‌. 5 గురికి ప‌ద్మ విభూష‌ణ్ అవార్డుల‌ను కేంద్రం ఆదివారం ప్ర‌క‌టించింది.

వీరిలో సినీ న‌టులు కేర‌ళ నుంచి మ‌మ్ముట్టి, గాయ‌ని అల్కా యాజ్ఞిక్‌ల‌కు ప‌ద్మ భూష‌ణ్ (Mammootty), తెలుగు నుంచి రాజేంద్ర ప్ర‌సాద్ (Rajendra Prasad), ముర‌ళీ మోహ‌న్ (Murali Mohan)ల‌కు, త‌మిళ న‌టుడు మాద‌వ‌న్‌, ప‌ద్మ‌శ్రీ, బాలీవుడ్ నుంచి దివంగ‌త ధ‌ర్మేంద్ర (Dharmendra) కు ప‌ద్మ విభూష‌ణ్ అవార్డుల‌ను ప్ర‌క‌టించింది.

వీరితో పాటు బాలీవుడ్‌ నటులు అనిల్‌కుమార్‌ రస్తోగి, అరవింద్‌ వైద్య, సతీశ్‌ షా (మరణానంతరం) ప్రముఖ బెంగాలీ నటుడు ప్రసేన్‌జిత్‌ ఛటర్జీ, యాడ్‌ ఫిల్మ్‌ మేకర్‌ పియూష్‌ పాండే (మరణానంతరం)లను పద్మ శ్రీ పురస్కారాలు వరించాయి.

Updated Date - Jan 26 , 2026 | 07:11 AM