Gopichand: 25 ఏళ్ల సినీ ప్రయాణం.. ఎన్నో పాఠాలు నేర్పింది
ABN, Publish Date - Aug 03 , 2026 | 05:59 PM
మాచో స్టార్ గోపీచంద్ తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి 25 ఏళ్లు పూర్తిచేసుకున్నారు. ఈ సందర్భంగా తన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ అభిమానులు, ప్రేక్షకులు, సినీ పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.
మాచో స్టార్ గోపీచంద్ తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి 25 ఏళ్లు పూర్తిచేసుకున్నారు. ఈ సందర్భంగా తన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ అభిమానులు, ప్రేక్షకులు, సినీ పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు ఓ భావోద్వేగ లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ప్రయాణంలో తండ్రి ఆశీర్వాదాలే తనకు అతిపెద్ద బలం అని పేర్కొన్నారు. తెలుగు ప్రేక్షకులతో పాటు ఇతర భాషల ప్రేక్షకులకు, తనను ఆదరించిన ప్రతి హీరో అభిమానులకు కూడా గోపీచంద్ ధన్యవాదాలు తెలిపారు.
"సినిమాల్లో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నా ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. నన్ను నమ్మి అవకాశాలు ఇచ్చిన నిర్మాతలు, దర్శకులు, రచయితలు, సహనటులు, సాంకేతిక నిపుణులు, సినీ పరిశ్రమలోని ప్రతి సభ్యుడికి రుణపడి ఉంటాను. మీ నమ్మకం, ప్రోత్సాహమే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి. అభిమానులు చూపించిన ప్రేమ, నమ్మకం, ఆదరణకు ఎంత కృతజ్ఞత చెప్పినా తక్కువే. నా విజయాల్లో మీ పాత్ర ఎంతో గొప్పది. ప్రతి దశలో నా వెంటే నిలబడి ఈ 25 ఏళ్ల ప్రయాణాన్ని మరపురానిదిగా మార్చారు. మీ ప్రేమ, ఆదరణను జీవితాంతం గుండెల్లో దాచుకుంటాను. ఈ 25 ఏళ్ల ప్రయాణం నాకు ఎన్నో పాఠాలు నేర్పింది. ఇకపై కూడా మరింత కష్టపడి, మంచి కథలు, మంచి పాత్రలతో మీ ముందుకు వస్తాను. త్వరలో 'భారతవర్ష', 'సింగా'తో పాటు మరిన్ని చిత్రాల ద్వారా థియేటర్లలో కలుద్దాం" అని లేఖలో పేర్కొన్నారు.