హిట్ కోసం గోపీచంద్ కష్టాలు..
ABN, Publish Date - May 01 , 2026 | 04:24 PM
ఇండస్ట్రీలో చాలా యేళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తోన్న హీరోల్లో గోపీచంద్ (Gopichand)ఒకరు. మంచి మంచి కథలను ఎంచుకుంటున్నా కూడా మ్యాచో స్టార్ కి హిట్ మాత్రం దక్కడం లేదు.
ఇండస్ట్రీలో చాలా యేళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తోన్న హీరోల్లో గోపీచంద్ (Gopichand)ఒకరు. మంచి మంచి కథలను ఎంచుకుంటున్నా కూడా మ్యాచో స్టార్ కి హిట్ మాత్రం దక్కడం లేదు. చాలామంది గోపీచంద్ ని హీరోగా కాకుండా విలన్ గా ట్రై చేయాలనీ సలహాలు కూడా ఇస్తున్నారు. అయినా కూడా గోపీచంద్ పట్టు విడవని విక్రమార్కుడిలా ఇండస్ట్రీపై యుద్ధం చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తోన్న చిత్రం గోపీచంద్ 33. సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకు శూల అనే పేరును ఖరారు చేసినట్లు సమాచారం. ఈ సినిమాపై గోపీచంద్ చాలా ఆశలు పెట్టుకున్నారు.
అందుతున్న సమాచారం ప్రకారం శూల షూటింగ్ పూర్తికాకముందే గోపీచంద్ మరో సినిమాను పట్టాలెక్కించినట్లు తెలుస్తోంది. కుమార్ సాయి అనే కొత్త డైరెక్టర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తోండగా BVSN ప్రసాద్ నిర్మిస్తున్నారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం గోపీచంద్ పూర్తిగా లుక్ మార్చినట్లు టాక్ నడుస్తోంది. త్వరలోనే గోపీచంద్ 34 ప్రారంభం కానుంది. ఎక్కువ శాతం షూటింగ్ లండన్ లో జరగనుందని సమాచారం.
ఈ రెండు సినిమాలు కాకుండా మరో సినిమాకు కూడా గోపీచంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. టాప్ స్టంట్ మాస్టర్ వెంకట్.. ఈ చిత్రంతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. మే 3 న ఈ సినిమా రామానాయుడు స్టూడియోస్ లో పూజా కార్యక్రమాలను జరుపుకోనున్నది. మరి హిట్ కోసం గోపీచంద్ పడుతున్న కష్టాలకు ప్రతిఫలం దక్కుతుందా.. లేదా.. ? అనేది చూడాలి.