సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

విడుదలైన 'తిమ్మరాజుపల్లి టీవీ' మూవీ సాంగ్

ABN, Publish Date - Apr 13 , 2026 | 11:11 AM

కిరణ్‌ అబ్బవరం నిర్మిస్తున్న గ్రామీణ నేపథ్య వినోద ప్రధాన చిత్రం 'తిమ్మరాజుపల్లి టీవీ'. ఈ సినిమా నుండి 'గోపాల గోపాల' అనే గీతం విడుదలైంది. దీనిని మేఘన నాయుడు పాడారు.

Thimmaraju Palli TV Movie

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా 'తిమ్మరాజుపల్లి టీవీ'. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రానికి వి. మునిరాజు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి 'గోపాల గోపాల..' సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటకు సనరే సాహిత్యాన్ని అందించగా, వంశీకాంత్ రేఖన కంపోజ్ చేశారు. మేఘన నాయుడు పాడారు. ఈ పాట ఎలా ఉందో చూస్తే - 'గోకుల గోపాలక, మాధవ నారాయణ, కానగా సాధ్యమా, కలియుగ మాయ, గోకుల గోపాలక, మాధవ నారాయణ' అంటూ కలియుగంలో జరుగుతున్న వింత ఘటనల్ని ఆ గోవిందుడికి విన్నవిస్తూ ఆకట్టుకునేలా సాగుతుందీ పాట. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

Updated Date - Apr 13 , 2026 | 11:11 AM