సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

త్వరలో.. తెలుగు, మరాఠీ భాషల్లో 'గూగుల్ మై ఫ్రెండ్'

ABN, Publish Date - Mar 29 , 2026 | 10:14 PM

ప్రణవ్ రావ్ రాణి, ప్రజక్త గైక్వాడ్ నటిస్తున్న గూగుల్ మై ఫ్రెండ్ సినిమా సాంగ్స్ లాంచ్ ఘనంగా జరిగింది.

google

ప్రణవ్ రావ్ రాణి, ప్రజక్త గైక్వాడ్ జంటగా నటిస్తున్న చిత్రం గూగుల్ మై ఫ్రెండ్. డాలర్స్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దివాకర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని బహుభాషా దర్శకుడిగా గుర్తింపు పొందిన గోవింద్ వరాహ తెరకెక్కిస్తున్నారు. టి. వెంకటేష్ రెడ్డి, బి. ప్రసన్నాంజనేయులు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తెలుగు, మరాఠీ భాషల్లో ఈ సినిమా త్వరలో గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది.

ఇటీవల ఈ సినిమా సాంగ్స్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. దర్శకుల సంఘం అధ్యక్షుడు వీఎన్ ఆదిత్యతో పాటు సాయి రాజేశ్, వి సముద్ర, శైలేష్ కొలను, కొండా విజయ్ కుమార్ పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దర్శకుడు సాయి రాజేశ్ మాట్లాడుతూ, గోవింద్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కంటెంట్ చాలా ప్రామిసింగ్‌గా ఉంది. తెలుగు, మరాఠీ భాషల్లో ఒకేసారి రూపొందించడం ప్రత్యేకత. మంచి రిలీజ్ దక్కి నిర్మాతకు లాభాలు, గోవింద్‌కు మంచి పేరు రావాలి” అని అన్నారు.

వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ, “గోవింద్ వరాహ మంచి అనుభవం ఉన్న దర్శకుడు. ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధించి, ఆయన మరిన్ని పాన్ ఇండియా చిత్రాలు చేయాలి” అని ఆకాంక్షించారు. వి సముద్ర మాట్లాడుతూ, “మా స్నేహితుడు గోవింద్ పలు భాషల్లో సినిమా తెరకెక్కించడం ఆనందంగా ఉంది. ఈ చిత్రానికి మంచి విజయాన్ని కోరుకుంటున్నాం” అని తెలిపారు. కొండా విజయ్ కుమార్ మాట్లాడుతూ, “గోవింద్ గారు రామానాయుడు గారిలా బహుభాషా సినిమాలపై దృష్టి పెట్టడం అభినందనీయం. గూగుల్ మై ఫ్రెండ్ అన్ని భాషల్లో విజయం సాధించాలి” అని అన్నారు.

దర్శకుడు గోవింద్ వరాహ మాట్లాడుతూ, “తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా సినిమాలు చేస్తూ వచ్చిన నేను, మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు గూగుల్ మై ఫ్రెండ్‌తో వస్తున్నాను. ఇకపై తెలుగులో వరుసగా సినిమాలు చేస్తాను. మా నిర్మాతలు ఇచ్చే సపోర్ట్ వల్లే ఈ ప్రయాణం సాధ్యమవుతోంది” అని తెలిపారు. అలాగే తనకు సహకరిస్తున్న నిర్మాతలు ఏఎం రత్నం, కెకె రాధమోహన్, చిట్టూరి శ్రీనివాస్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Mar 29 , 2026 | 10:14 PM