సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అభిమానులకు.. గుడ్‌న్యూస్‌ చెప్పిన రష్మిక

ABN, Publish Date - Aug 31 , 2026 | 06:20 AM

ఇండస్ట్రీకి, అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెప్పేశారు రష్మిక మందన్న.

Rashmika

ఇండస్ట్రీకి, అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెప్పేశారు రష్మిక మందన్న (Rashmika Mandanna). త్వరలోనే షూటింగులకు హాజరవుతానని ఇన్‌స్టా వేదికగా వెల్లడించారు. ‘మైసా’ ( Mysaa) సినిమా కోసం పాట చిత్రీకరిస్తుండగా, రష్మిక కుడి కాలు తుంటి భాగానికి గాయమైంది. వైద్యుల సలహా మేరకు ఆమె కొన్ని వారాలుగా విశ్రాంతి తీసుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఎప్పటికప్పుడు విశేషాలను పంచుకుంటూనే ఉన్నారు.

ఈ నేపథ్యంలో ఆదివారం శుభవార్తను చెప్పేశారు. ‘త్వరలోనే సెట్స్‌కి వెళ్తాను. కాకపోతే వీటన్నిటినీ మిస్‌ అవుతాను’ అంటూ కొన్ని ఫొటోలు షేర్‌ చేశారు. పూజ చేయడం, ఆత్మీయులను కలుసుకోవడం, సరదాగా నచ్చిన పనులు చేయడం, కుక్కతో ఆడుకోవడం, ప్రకృతిని ఆస్వాదించడం వంటి అంశాలు ఆ ఫొటోల్లో, వీడియోల్లో ఉన్నాయి. ప్రస్తుతం ఆమె నటిస్తున్న ‘మైసా’, ‘రణబాలి’ (Ranabaali) చిత్రాలు సెట్స్‌ మీదున్నాయి. ‘రాకా’ (Raaka) మూవీకి వచ్చే నెలాఖరు నుంచి కాల్షీట్‌ ఇచ్చినట్టు సమాచారం.

Updated Date - Aug 31 , 2026 | 07:16 AM