గోదావరిలో పడితే బయటకు రావచ్చు.. ‘గోదారి గట్టుపైన’ ప్రేమలో పడితే
ABN, Publish Date - Apr 28 , 2026 | 04:41 PM
సుమంత్ ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'గోదారి గట్టుపైన'. నూతన దర్శకుడు సుభాష్ చంద్ర దర్శకత్వంలో, రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రంలో నిధి ప్రదీప్ కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్ర పోషించారు.
సుమంత్ ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'గోదారి గట్టుపైన'. నూతన దర్శకుడు సుభాష్ చంద్ర దర్శకత్వంలో, రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రంలో నిధి ప్రదీప్ కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్ర పోషించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. సినిమా మే 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో..
సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ 'మేము ఫేమస్’ సినిమాకు మీరు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. ఈ సినిమాకి కూడా అలాగే ఆదరణ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా గోదారి యాస నేర్చుకుని మాట్లాడాను. ప్రతి డైలాగ్‌ను సహజంగా చెప్పడానికి ప్రయత్నించాను. ఈ ప్రయత్నం మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. నిధి కూడా చాలా చక్కగా తెలుగు నేర్చుకుని మాట్లాడింది. జగపతిబాబు గారితో పని చేయడం గొప్ప అనుభవం. నిర్మాత అభినవ్ గారు సినిమాను ఎంతో అద్భుతంగా నిర్మించారు. కృష్ణపట్నం ఫుడ్ ఎంత టేస్టీగా ఉంటుందో, మా సినిమా కూడా అంత క్యూట్‌గా ఉంటుంది. ఈ ట్రైలర్‌లో మీరు చూసింది సినిమాలో ఉంటుంది. సినిమాలో ఉన్నదే మన జీవితంలో ఉంటుంది. ఇది పూర్తిగా రిలేట్ అయ్యే సినిమా. గోదావరి ప్రాంతం చాలా అందంగా ఉంటుంది. అక్కడి లొకేషన్స్ నాకు కేరళ కంటే అందంగా అనిపించాయి. మే 8న మీ ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాను చూడండి. గోదావరిలో పడితే బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది… కానీ మా ‘గోదారి గట్టుపైన’ ప్రేమలో పడితే బయటకు రావడం కష్టం. అంతగా మీరు సినిమాను ప్రేమిస్తారు. ఈ సమ్మర్ లో సినిమా అందరికీ కూల్ వైబ్ ఇస్తుంది' అని అన్నారు.
డైరెక్టర్ సుభాష్ చంద్ర మాట్లాడుతూ 'ఈ ట్రైలర్ మీకు నచ్చడం చాలా ఆనందంగా ఉంది. తరాలు మారినా ప్రేమ మాత్రం మారదు. ఇందులో ప్రేమికుల ప్రేమతో పాటు తండ్రి-కూతురు ప్రేమను చూపించాం. సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకుడి ముఖంలో చిరునవ్వు ఉంటుంది. మా ‘గోదారి గట్టుపైన’ ఈ వేసవిలో ఒక చలివేంద్రంలాంటిది. నా మొదటి సినిమానే అయినా గొప్ప ఆర్టిస్టులతో పని చేసే అవకాశం దొరికింది. జగపతిబాబు, రాజీవ్ కనకాల, దేవి ప్రసాద్, హర్షవర్ధన్ వంటి సీనియర్స్ అద్భుతంగా నటించారు. వీరంతా నవ్విస్తారు, కవ్విస్తారు, మురిపిస్తారు, ఏడిపిస్తారు. ఇది నా గ్యారెంటీ' అన్నారు.
హీరోయిన్ నిధి ప్రదీప్ మాట్లాడుతూ 'ఈ సినిమా నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభవం. ‘మాయ’ పాత్ర అందరికీ నచ్చుతుంది' అన్నారు.