బాలయ్య 111 టైటిల్.. అదా.. ఇదా
ABN, Publish Date - Aug 24 , 2026 | 06:46 PM
ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. అందులో ఒకటి NBK 111. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.
ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. అందులో ఒకటి NBK 111. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ కాంబోలో వీరసింహారెడ్డి లాంటి హిట్ సినిమా వచ్చింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లిమ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈమధ్యనే బాలయ్యకు గాయం అవ్వడంతో కొంచెం షూటింగ్ కి గ్యాప్ వచ్చిన విషయం తెల్సిందే. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
గతకొంతకాలంగా టాలీవుడ్ లో రెండు అక్షరాల టైటిల్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఓజీ తరువాత ఈ ట్రెండ్ బాగా ఎక్కువైంది. అంతెందుకు చిరంజీవి- బాబీ కాంబోలో వస్తోన్న చిత్రంకి కూడా కాకా అనే రెండక్షరాల టైటిల్ నే పెట్టారు. ఇక ఇప్పుడు బాలయ్య సినిమాకి కూడా అదే రెండు అక్షరాల టైటిల్ ని కన్ఫర్మ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా టైటిల్‌కు సంబంధించి ఫిలింనగర్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రానికి గాడ్ లేదా దాదా అనే రెండు పవర్ ఫుల్ టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయని, వీటిలో ఒకదానిని బాలయ్యతో చర్చించిన అనంతరం అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం.
ఈ చిత్రంలో బాలయ్య బాంబే బ్యాక్‌డ్రాప్‌లో ఒక శక్తివంతమైన మాఫియా డాన్‌గా కనిపించనున్నారని, రెగ్యులర్ ఫార్మాట్‌లో కాకుండా చాలా భిన్నమైన ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌తో గోపీచంద్ మలినేని ఈ కథను డిజైన్ చేశాడని సమాచారం. అందుకే దాదా అనే టైటిల్ బావుంటుందని కొందరు అంటుండగా.. గాడ్ ఆఫ్ మాసెస్ అనే ట్యాగ్ లైన్ ఎలాగో ఉంది. ఈ మాస్ కథకు గాడ్ అనే టైటిల్ పర్ఫెక్ట్ గా యాప్ట్ అవుతోందని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. మరి బాలయ్య.. ఏ టైటిల్ ని కన్ఫర్మ్ చేస్తారో తెలియాల్సి ఉంది. డిసెంబర్ 24న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తుండటంతో, వచ్చే నెల నుంచి షూటింగ్‌ను రీ-స్టార్ట్ చేసి నాన్-స్టాప్‌గా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ సినిమాతో బాలయ్య ఎలాంటి విజయన్ని అందుకుంటాడో చూడాలి.