Transfer Trimurthulu: గిర్ర గిర్ర.. వడ్డే నవీన్ పార్టీ సాంగ్ ఇరగదీశాడుగా
ABN, Publish Date - Jun 07 , 2026 | 01:42 PM
చాలా విరామం తర్వాత సీనియర్ హీరో వడ్డే నవీన్ రీ ఎంట్రీ ఇస్తూ నటించిన చిత్రం ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు.
చాలా విరామం తర్వాత సీనియర్ హీరో వడ్డే నవీన్ (Vadde Naveen) రీ ఎంట్రీ ఇస్తూ నటించిన చిత్రం ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు (Transfer Trimurthulu). హీరో వడ్డే నవీన్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించగా కమల్ తేజ్ నార్ల దర్శకత్వం వహించాడు. రాశీ సింగ్ (Rashi Singh) కథానాయుక. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 19న థియేటర్లలో విడుదలకు రెడీ అయింది.
ఈ నేపథ్యంలో మేకర్స్ ఇప్పటి వరకు విడుదల చేసిన పోస్టర్స్, టీజర్, పాటలు ఆకట్టుకోవడమే గాక సినిమాపై మంచి రెస్పాన్స్ తీసుకు రాగా తాజాగా ఈ చిత్రం నుంచి గిర గిర (Girra Girra) అంటూ సాగే ఓ పార్టీ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటకు భాస్కరబట్ల (Bhaskarabhatla Ravikumar) సాహిత్యం అందించగా కల్యాణ్ నాయక్ (Kalyan Nayak) సంగీతంలో సాహితి చాగంటి (Sahithi Chaganti), స్వరాగ్ కీర్తన్ (Swaraag Keerthan) ఆలపించారు. విజయ్ పోలకి ( Vijay Polaki) నృత్య రీతులు సమకూర్చారు.