Geethanjali 4K: ‘గీతాంజలి 4K’ రీ రిలీజ్.. స్పెషల్ ఏంటో తెలుసా

ABN , Publish Date - Aug 19 , 2026 | 06:42 PM

కింగ్ నాగార్జున ఎవర్‌గ్రీన్ క్లాసిక్స్‌లో ఒకటైన ‘గీతాంజలి’ చిత్రం రీ రిలీజ్‌కు సిద్ధమైంది. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ఈ క్లాసిక్ లవ్‌స్టోరీ ఇప్పుడు మరోసారి థియేటర్లలో తన మ్యాజిక్‌ను చూపించడానికి రాబోతోంది.

Geethanjali 4K Re Release Update

కింగ్ నాగార్జున (King Nagarjuna) ఎవర్‌గ్రీన్ క్లాసిక్స్‌లో ఒకటైన ‘గీతాంజలి’ (Geethanjali 4K) చిత్రం రీ రిలీజ్‌కు సిద్ధమైంది. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ఈ క్లాసిక్ లవ్‌స్టోరీ ఇప్పుడు మరోసారి థియేటర్లలో తన మ్యాజిక్‌ను చూపించడానికి రాబోతోంది. ఆగస్టు 29న నాగార్జున బర్త్‌డే (Nagarjuna Birthday Special) సందర్భంగా.. ఒక రోజు ముందుగానే అంటే ఆగస్ట్ 28న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో 4K ఫార్మాట్‌లో ప్రపంచవ్యాప్తంగా రీ-రిలీజ్ కానుంది. అదే రోజు రక్షాబంధన్ కూడా కావడంతో ఈ రీ-రిలీజ్‌కు మరింత ప్రత్యేకత సంతరించుకుంది. ఈ రీ రిలీజ్ స్పెషల్ ఏంటంటే.. ఇప్పటి వరకు తెలుగు హీరోల సినిమాలు రీ రిలీజ్ విషయంలో ఒక్క భాషకే పరిమితమవగా.. ‘గీతాంజలి’ మాత్రం తెలుగు, తమిళ రెండు భాషల్లో రిలీజ్ అవుతూ సరికొత్త రికార్డును క్రియేట్ చేయబోతోంది. శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్‌పై బూర్లె శివ ప్రసాద్ ఈ ఎవర్‌గ్రీన్ క్లాసిక్‌ను లేటెస్ట్ 4K టెక్నాలజీతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


‘గీతాంజలి’ అంటే.. ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తొచ్చేది అందమైన ప్రేమకథ, మనసును తాకే సంగీతం, అద్భుతమైన విజువల్స్, గుర్తుండిపోయే పెర్ఫార్మెన్స్. మాస్ట్రో ఇళయరాజా అందించిన సంగీతం ఈ సినిమాకు మరో బలంగా నిలిచి ఈ సినిమాను క్లాసిక్‌గా మార్చింది. నాగార్జున సరసన గిరిజ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని మణిరత్నం తనదైన స్టోరీటెల్లింగ్‌తో ఒక అందమైన కవితలా తెరకెక్కించారు. కింగ్ నాగార్జునను ఎంతో చార్మింగ్‌గా, ఎమోషనల్‌గా చూపించిన ఈ సినిమా ఆయన కెరీర్‌లోనే ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిందంటే అతిశయోక్తి కానే కాదు.


ఈసారి 4K ఫార్మాట్‌లో ఈ సినిమాను చూడటం ఈ రీ-రిలీజ్‌లో ప్రధాన ఆకర్షణ కానుంది. ఇటీవల వచ్చిన నాగ్ ‘శివ’ను ఎలా అయితే ఛేంజ్ చేశారో.. ఇప్పుడు ‘గీతాంజలి’ విషయంలో కూడా మరింత క్లారిటీ, డీటెయిలింగ్‌తో విజువల్స్‌ను ప్రేక్షకులు కొత్త అనుభూతితో ఎక్స్‌పీరియన్స్ చేయబోతున్నారని ఈ సినిమాను విడుదల చేస్తున్న బూర్లె శివ ప్రసాద్ చెబుతున్నారు. అప్పట్లో థియేటర్లలో ‘గీతాంజలి’ని చూసిన వారికి ఇది మరోసారి ఆ రోజులను గుర్తుచేసే నాస్టాల్జిక్ జర్నీ అవుతుందని, ఇక ఈ సినిమాను థియేటర్లలో చూడని నేటి జనరేషన్‌కు మాత్రం ఒక ఎవర్‌గ్రీన్ క్లాసిక్‌ను బిగ్ స్క్రీన్‌పై ఎక్స్‌పీరియన్స్ చేసే అవకాశం దక్కనుందని ఆయన వెల్లడించారు. చూద్దాం మరి.. ఈ కల్ట్ క్లాసిక్ రీ రిలీజ్‌లో ఎలాంటి స్పందనను రాబట్టుకుంటుందో?

ఈ వార్తలు కూడా చదవండి:

వెంకీ, కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి కాంబో మూవీకి ఆసక్తికరమైన టైటిల్.. ఏంటంటే

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. అభిమాని శశి భవ్యత‌కు రామ్‌ పోతినేని భరోసా

పెళ్ళైన మగాడితో అడ్డంగా దొరికిన ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్...

Updated Date - Aug 19 , 2026 | 06:42 PM