వెంకీ, కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి కాంబో మూవీకి ఆసక్తికరమైన టైటిల్.. ఏంటంటే
ABN , Publish Date - Aug 19 , 2026 | 05:37 PM
విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మల్టీస్టారర్ చిత్రంపై చిత్ర బృందం అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది
విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh), నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) హీరోలుగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మల్టీస్టారర్ చిత్రంపై చిత్ర బృందం అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. ఈ చిత్రంలో కీర్తి సురేష్, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ టైటిల్ రివీల్ చేస్తూ మేకర్స్ విడుదల చేసిన స్పెషల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ నవ్వులు పూయిస్తూ వైరల్ అవుతోంది.
దివంగత లెజెండరీ దర్శకుడు ఇవివి సత్యనారాయణ వింటేజ్ కామెడీ స్పూర్తితో ఈ టైటిల్ గ్లింప్స్‌ను డిజైన్ చేశారు. హీరోలు వెంకటేష్, కళ్యాణ్ రామ్‌లతో పాటు హీరోయిన్లు కీర్తి సురేష్, కృతి శెట్టి కలిసి దర్శకుడు అనిల్ రావిపూడిని ‘సినిమా టైటిల్ ఏంటి?’ అని అడగ్గా, ఆయన ‘జనవరి 12 విడుదల’ అని పదే పదే బదులిస్తారు. రిలీజ్ డేట్ కాదు సినిమా టైటిల్ అడుగుతున్నాం కదా అని వెంకీ అడగగా, అసలు ఆ సినిమా పేరే ‘జనవరి 12 విడుదల’ (January 12 Vidudala) అని రివీల్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రానికి ‘బావ బావమర్ది సౌజన్యంతో’ అనే సరదా ట్యాగ్‌లైన్ కూడా జోడించారు.
షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తోన్న ఈ భారీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా పండగ వాతావరణంలో 12 జనవరి, 2027న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. టైటిల్, రిలీజ్ డేట్ రెండూ ఒకటే అయ్యేలా డిజైన్ చేసిన ఈ వినూత్న టైటిల్‌తో సినిమాపై ఓ రేంజ్‌లో అంచనాలు మొదలయ్యాయి. అనిల్ రావిపూడి ప్రమోషన్స్ నిర్వహించే తీరు ఎలా ఉంటుందో తెలియంది కాదు. ఈ సినిమాకు కూడా మొదటి నుంచి వైవిధ్యంగా ఏదో ఒకటి చేస్తూనే వస్తున్నారు. ఇప్పుడు టైటిల్ రివీలింగ్ విషయంలో అనిల్ రావిపూడి తన ప్రమోషన్స్ స్ట్రాటజీ మరోసారి ప్రదర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. అభిమాని శశి భవ్యతకు రామ్ పోతినేని భరోసా
పెళ్ళైన మగాడితో అడ్డంగా దొరికిన ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్...
Balakrishna: 'రాముడు - భీముడు' సినీ నిర్మాత మృతి