సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఓటీటీకి వచ్చేస్తోన్న గరివిడి లక్ష్మీ.. ఎందులో చూడొచ్చు అంటే

ABN, Publish Date - Nov 25 , 2026 | 01:58 PM

టాలీవుడ్ హీరోయిన్ ఆనంది ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గరివిడి లక్ష్మీ. ఉత్తారాంధ్ర జానపదాలను బుర్రకథలుగా మార్చి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న గరివిడి లక్ష్మీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకి గౌరీనాయుడు జమ్ము దర్శకత్వం వహించాడు.

Garividi Lakshmi

టాలీవుడ్ హీరోయిన్ ఆనంది (Anandi) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గరివిడి లక్ష్మీ (Garividi Lakshmi). ఉత్తారాంధ్ర జానపదాలను బుర్రకథలుగా మార్చి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న గరివిడి లక్ష్మీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకి గౌరీనాయుడు జమ్ము దర్శకత్వం వహించాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 17 న రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ అందుకుని డీసెంట్ విజయాన్ని అందుకుంది. ఆనంది నటనతో పాటు రాశి, వీకే నరేష్, రాగ్ మయూర్, శరణ్య ప్రదీప్ వంటి నటీనటులు కీలక పాత్రల్లో మెప్పించారు. చరణ్ అర్జున్ సంగీతం అందించిన ఈ చిత్రం పెద్ద సినిమాల పోటీ మధ్య కూడా ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో మంచి వసూళ్లు, విమర్శకుల ప్రశంసలు అందుకుంది.


ఇక ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీ బాట పట్టింది. ఈ చిత్ర డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసింది. నవంబర్ 26 నుంచి గరివిడి లక్ష్మీ అమెజాన్ లో స్ట్రీమింగ్ కానుంది. అన్ని భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. 1970ల నాటి ఉత్తరాంధ్ర పల్లెటూరి వాతావరణం, యాస, భాషతో పాటు ఒక కళాకారిణిగా గరివిడి లక్ష్మి ఎదుర్కొన్న సవాళ్లు, అవమానాలు, వివక్షను ఇందులో హత్తుకునేలా చూపించారు. 90ల కాలంలో దాదాపు 15 ఏళ్లలో వేలాది ప్రదర్శనలతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె ప్రయాణం, కథలో వచ్చే మలుపులు సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.


గరివిడి లక్ష్మీ కథ విషయానికొస్తే.. చిన్నతనం నుంచి తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోని ఒక అమ్మాయి గరివిడి లక్ష్మీ( ఆనంది). ఆ ప్రేమని భర్తలో చూసుకోవాలనుకుంటుంది. కానీ, అది కూడా మూడునాళ్ల ముచ్చటగా మారుతోంది. అలా ఒంటరిగా ఉన్న లక్ష్మీ జీవితంలోకి బుర్రకథ ప్రవేశిస్తోంది. ఆ తరువాత ఎన్నో జానపదాలని బుర్రకథలుగా మార్చి తన గొంతుతో వాటికి జీవం పోసి గుర్తింపు తెచ్చుకుంటుంది. అంతా గుర్తింపు తెచ్చుకున్న గరివిడి లక్ష్మీ సినిమాల్లో ఎందుకు పాడలేదు.. ? సడెన్ గా ఎవరికి కనిపించకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది..? ఆమె జీవితంలో ఎదురైన సంఘటనల సమూహారమే ఈ చిత్రం. థియేటర్ లో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Updated Date - Nov 25 , 2026 | 01:58 PM