Garikapati Narasimharao: నా అభిమానులు క్షమించరు.. రేవు
ABN, Publish Date - Jan 02 , 2026 | 08:32 PM
నటుడు శివాజీ (Shivaji) ఆడవారి డ్రెసింగ్ పై చేసిన వ్యాఖ్యల వలన యూట్యూబర్ నా అన్వేష్ (Naa Anveshana) బలయ్యాడు.
Garikapati Narasimharao: నటుడు శివాజీ (Shivaji) ఆడవారి డ్రెసింగ్ పై చేసిన వ్యాఖ్యల వలన యూట్యూబర్ నా అన్వేష్ (Naa Anveshana) బలయ్యాడు. శివాజీ చేసిన వ్యాఖ్యల వలన ఫేమస్ అవుదామనుకున్నాడో ఏమో తెలియదు కానీ, ఆడవారికి సపోర్ట్ గా మాట్లాడుతూ శివాజీని బండబూతులు తిడుతూ ఒక వీడియో పెట్టాడు. ఇక ఈ వివాదంలోకి గరికపాటి నరసింహారావు (Garikapati Narasimharao)ను కూడా లాగాడు. ఆయనను కూడా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి లేనిపోని వివాదాన్ని కొనితెచ్చుకున్నాడు. నాకేంటి.. నాకు ఫాలోవర్స్ ఉన్నారు, ఏది మాట్లాడినా సపోర్ట్ చేస్తారు అన్న ధైర్యంతో సీతాదేవి, ద్రౌపది అంటూ దేవతలను కూడా బలత్కరించడానికి ప్రయత్నించలేదా అంటూ చెప్పి హిందూ సంఘాల ఆగ్రహానికి గురయ్యాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు. ఆడవారి డ్రెస్సింగ్ గురించి మాట్లాడిన శివాజీ సారీ చెప్పి సైడ్ అయ్యిపోయాడు. మొత్తానికి అన్వేష్ ఇరుక్కున్నాడు.
తాజాగా గరికపాటి నరసింహారావు సైతం అన్వేష్ మీద మండిపడ్డాడు. ఒక వీడియోలో ఆయన అన్వేష్ పేరు తీసుకురాకుండా తప్పుచేసేవారి గురించి, ఆ తప్పును ఎంకరేజ్ చేసేవారి గురించి చెప్పుకొచ్చాడు. ' ఒక నేరస్తుడికి స్సాక్షా పడితే వాడు మారతాడో లేదో తెలియదు కానీ, ఒక పదిరోజులు పదిమంది వాడిని ఈసడించుకుంటే మాత్రం వాడిలో మార్పు వస్తుంది. ఎవరు తప్పు చేసినా కూడా వారు వీధుల్లోకి వచ్చే ధైర్యం చేయకూడదు. అలా చేస్తేనే సమాజంలో మార్పు వస్తుంది.
ఏ మచ్చలేని వ్యక్తులపై బురద చల్లడం, వారిని నిందించడం లాంటి చర్యలను సమాజం ఎంతవరకు సహిస్తుంది. వాటిని ఎవరు పట్టించుకోకుండా మనకెందుకులే అని వదిలేస్తే మరింత కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు.తప్పును తప్పు అని ముఖం మీదే దైర్యంగా చెప్పాలి. ఇక నాపై వస్తున్న కామెంట్స్ పై నా అభిమానులే సరైన విధంగా బుద్ది చెప్తున్నారు. నా విషయంలో నా అభిమానులు ఎప్పుడు సహించలేదు. ఎప్పటికప్పుడు రేవు పెట్టేస్తున్నారు. సోషల్ మీడియాలో జరిగే యుద్ధంలో కూడా ధర్మంపై నమ్మకం ఉన్నవారే గెలుస్తున్నారు. నేను ఎప్పటికి ధర్మం వైపే నిలుస్తాను' అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.