సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Gaddar Awards: మరో రెండు రోజుల పొడిగింపు!

ABN, Publish Date - Jan 31 , 2026 | 05:51 PM

గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ అప్లికేషన్ జారీ, స్వీకరణ గడువును ఫిబ్రవరి 5వ తేదీకి పొడిగించారు. నేషనల్ బ్యాంక్ హాలిడేస్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

Gaddar film awards

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమం గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ (Gaddar Film Awards). గత యేడాది ప్రారంభమైన ఈ అవార్డులను ఈసారి మరింత ముందుగా నిర్వహించాలని ప్రభుత్వం తలపెట్టింది. జనవరిలోనే దీనికి సంబంధించిన కసరత్తును ప్రారంభించింది. ఇప్పటికే గద్దర్ అవార్డుల విధివిధానాలను ఖరారు చేసింది. అలానే ఈసారి సి.నారాయణరెడ్డి పేరుతోనూ అవార్డును ఇవ్వబోతోంది. ఇదిలా ఉంటే... గద్దర్ అవార్డ్స్ అప్లికేషన్స్ ను జనవరి 31 వరకూ ఇస్తామని, ఫిబ్రవరి 3వ తేదీలోగా వాటిని సబ్మిట్ చేయాలని ప్రభుత్వం తెలిపింది. అయితే ఇప్పుడు వరుసగా బ్యాంక్ సెలవులు వచ్చిన కారణంగా ఫిబ్రవరి 5వ తేదీ మధ్యహ్నం రెండు గంటల వరకూ అప్లికేషన్స్ ను ఇవ్వబోతున్నారు. అలానే అదే రోజు సాయంత్రం నాలుగు గంటలలోగా అప్లికేషన్స్ ను సబ్ మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ అవకాశాన్ని సినిమా రంగానికి చెందిన వారు ఉపయోగించుకోవాల్సిందిగా తెలంగాణ ఎఫ్.డి.సి. తెలియచేసింది.

Updated Date - Jan 31 , 2026 | 05:51 PM