సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

కొత్త పాట‌తో.. గ‌త్త‌ర లేపుతున్న 'ఇడుపు కాయితం'

ABN, Publish Date - Oct 23 , 2026 | 07:25 PM

కొంత‌కాలంగా బాష, యాష‌, ట్రోలింగ్‌, ప్ర‌శంస‌ల‌ ప‌రంగా రెండు తెలుగు రాష్ట్రాల‌లో జ‌నం నోళ్ల‌లో బాగా నానుతున్న ఒకే ఒక్క చిత్రం ఇడుపు కాయితం.

Gadapa Lyrical, Idupu Kayitham

గ‌త కొంత‌కాలంగా బాష, యాష‌, ట్రోలింగ్‌, ప్ర‌శంస‌ల‌ ప‌రంగా రెండు తెలుగు రాష్ట్రాల‌లో జ‌నం నోళ్ల‌లో బాగా నానుతున్న ఒకే ఒక్క చిత్రం ఇడుపు కాయితం (Idupu Kayitham). బ‌న్నీ వాస్‌, త‌బిత సుకుమార్ సంయుక్త నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రానికి వంశీరెడ్డి దొండ‌పాటి (Vamsi Reddy Dondapati) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ మూవీ టైటిల్ ప్ర‌క‌ట‌న‌తోనే చిన్న‌పాటి సునామి సృష్టించిన ఈ చిత్రం కొద్ది రోజుల పాటు సామాజిక మాధ్య‌మాల్లో హ‌ల్‌చ‌ల్ చేసి ఖ‌ర్చులు లేని ప్ర‌చారాన్ని తీసుకు వ‌చ్చింది. మేక‌ర్స్ ఎలాంటి ప్ర‌య‌త్నాలు చేయ‌కుండానే సినిమా రిలీజ్‌కు ముందే ప్ర‌తి ఒక్క‌రికి సినిమా పేరు చేరువ‌య్యింది. ఆపై విడుద‌ల చేసిన శ్రీల‌త పాట సైతం విశేష జ‌నాద‌ర‌ణ ద‌క్కించుకుని సినిమాకు మ‌రికొంత బ‌లాన్ని చూకూర్చింది.

ఈ క్ర‌మంలోనే తాజాగా ఈ సినిమా నుంచి గ‌డ‌ప (Gadapa Lyrical) అంటూ సాగే మ‌రో సోల్‌ఫుల్ సాంగ్‌ను విడుద‌ల చేశారు. కొత్త‌గా పెళ్లి చేసుకున్న పెళ్లి కూతురు అబ్బాయి ఇంటికి వచ్చే స‌మ‌యంలో అమ్మాయి భావోద్వేగాల‌ను, భ‌రించాల్సిన భాద్య‌త‌ల‌ను వ‌ర్ణిస్తూ పాట అద్యంతం అద్భుతంగా ఎమోష‌న‌ల్‌గా సాగింది. అంతేగాక చాలా మందికి పాట‌లో త‌మ‌ను, త‌మ భాగ‌స్వాముల‌నుచ కుటుంబ స‌భ్య‌లను త‌లుచుకునేలా నాటి రోజుల‌ను గుర్తు చేస్తోంది. ఈ పాట‌కు అభిన‌య శ్రీనివాస్ (Abhinaya Srinivas) సాహిత్యం అందించ‌గా సురేశ్ బొబ్బిలి (Suresh Bobbili) సంగీతంలో గాయ‌ని తేలు విజ‌య (Telu Vijaya) ఆల‌పించింది.

ప్ర‌స్తుతం ఈ పాట సోష‌ల్‌ మీడియాలో దుమ్ము లేపుతుండ‌గా కేవ‌లం గంట‌ల వ్య‌వ‌ధిలోనే ఆఫ్ మిలియ‌న్ వ్యూస్ సాధించి స‌రికొత్త రికార్డులు నెల‌కొల్పుతోంది. పైగా ప్రియ‌ద‌ర్శి (Priyadarshi), నాగ‌దుర్గ (Naga Durga) ల న‌ట‌న మ‌రో స్థాయిలో ఉంది. ప్ర‌ధానంగా తెలంగాణ సంస్కృతి, సాంప్ర‌దాయాల‌ను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు విజువ‌ల్‌గా తెర‌కెక్కించారు. ఇంత‌వ‌ర‌కు మీరు పాట చూడ‌లేదా.. ఆస్చం ఎందుకు ఇప్పుడే ఈ పాట‌పై మీరూ ఓ లుక్ వేయండి.

Updated Date - Oct 23 , 2026 | 07:29 PM