Gaayapadda Simham: థియేటర్లలో చూసి.. ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు
ABN, Publish Date - Apr 29 , 2026 | 07:08 AM
గాయపడ్డ సింహం చిత్రం మే1న విడుదలవుతున్న సందర్భంగా మంగళవారం రాత్రి ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు.
‘గాయపడ్డ సింహం (Gaayapadda Simham)’ టీమ్ అందరికీ అభినందనలు. ఈ సినిమా గుర్తుండే విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ప్రేక్షకులు ఈ సినిమాను థియేటర్లలో చూసి ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారనే నమ్మకముంది’ అని కథానాయకుడు నారా రోహిత్ (Nara Rohith) అన్నారు. తరుణ్‌భాస్కర్ (Tharun Bhascker) ప్రధాన పాత్రలో కశ్యప్ శ్రీనివాస్ (Kasyap Sreenivas) తెరకెక్కించిన చిత్రమిది. జేడీ చక్రవర్తి ( J.D.Chakravarthy) కీలక పాత్ర పోషించారు.
దర్శకుడు పవన్ సాధినేని సమర్పణలో జీస్డూడియోస్, పీఓపీ స్టోరీస్, సప్తస్వ మీడియా వర్క్స్ బ్యానర్లపై ఉమేశ్ బన్సాల్, భానుకిరణ్ ప్రతాప, విజయ్‌కృష్ణ లింగమనేని, కల్యాణచక్రవర్తి మంథిన నిర్మించారు. మే1న విడుదలవుతున్న సందర్భంగా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నారా రోహిత్ ముఖ్య అతిథిగా విచ్చేసి టీమ్‌కు బెస్ట్ విషెస్ తెలిపారు.
ఈ చిత్రంలో అతిథి పాత్రలో నటించిన కథానాయకుడు శ్రీవిష్ణు (Sree Vishnu) మాట్లాడుతూ ‘అద్భుతమైన టైమింగ్ ఉన్న దర్శకుడు కశ్య్‌పశ్రీనివాస్ ఈ సినిమాను మరోస్థాయిలో తీశారు’ అని చెప్పారు. జేడీ చక్రవర్తి మాట్లాడుతూ ‘మీరంతా ఈ వేసవిలో హాయిగా నవ్వుకోవాలంటే ఈ చిత్రం మిస్ అవ్వకుండా చూడండి’ అని కోరారు. కశ్య్‌పశ్రీవినాస్ మాట్లాడుతూ ‘ఈ సినిమా నాకు మంచి ఫ్రెండ్స్‌ను ఇచ్చింది. ఇందులోని ప్రతీ సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’ అని పేర్కొన్నారు.