సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ప్రభాస్ రీల్ మేనల్లుడు.. బాలీవుడ్ లో అదరగొడుతున్నాడు

ABN, Publish Date - Jul 15 , 2026 | 05:38 PM

ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్టులు ఇప్పుడు హీరోలుగా హీరోయిన్లుగా మారుతున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా అమ్మాయిలు అయితే.. ఇట్టే పెద్దవారు అయిపోతున్నారు.

Akshay Bachhu

ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్టులు ఇప్పుడు హీరోలుగా హీరోయిన్లుగా మారుతున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా అమ్మాయిలు అయితే.. ఇట్టే పెద్దవారు అయిపోతున్నారు. అయితే చైల్డ్ ఆర్టిస్టులుగా నటించినవారు హీరోలు మాత్రమే అవ్వాలని రూల్ లేదు. తాజాగా ఒక చైల్డ్ ఆర్టిస్ట్ బాలీవుడ్ లో క్యాస్టింగ్ డైరెక్టర్ గా మారి సేన్సేషన్ సృష్టిస్తున్నాడు. అతడు ఎవరో కాదు అక్షయ్ బచ్చు (Akshay Bachhu). ఎవరీ అక్షయ్ అనుకుంటున్నారా.. సంతోషం సినిమాలో కింగ్ నాగార్జున కొడుకు లక్కీ పాత్రలో తన క్యూట్ యాక్టింగ్‌తో ప్రేక్షకులను అలరించిన చిన్నారి అక్షయ్ బచ్చు గుర్తున్నాడా? కోట శ్రీనివాసరావుతో కలిసి బాయ్ బాయ్ హింసరాజు అంటూ కళ్ళద్దాలు పెట్టుకొని.. బూరె బుగ్గలు వేసుకొని కనిపిస్తాడు. కేవలం సంతోషం మాత్రమే కాకుండా ప్రభాస్ బ్లాక్ బస్టర్ హిట్ వర్షం సినిమాలో యాంకర్ సుమ కొడుకుగా, ప్రభాస్‌కు మేనల్లుడిగా నటించి తన అమాయకమైన చూపులతో, చబ్బీ లుక్‌తో అక్షయ్ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు.


చిన్న వయసులోనే తెలుగుతో పాటు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ వాంటెడ్ వంటి చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేయడమే కాకుండా, దాదాపు 45కు పైగా ప్రముఖ బ్రాండ్ల ప్రకటనల్లో నటించి బాలనటుడిగా తనదైన ముద్ర వేశాడు అక్షయ్. ఇక చదువుపై దృష్టి పెట్టడం కోసం కొన్నాళ్ల పాటు రంగుల ప్రపంచానికి బ్రేక్ ఇచ్చిన అక్షయ్.. ఇప్పుడు మరోసాటి సినిమాలలో ఎంట్రీ ఇచ్చాడు. కుర్రాడు అప్పటికీ ఇప్పటికీ చాలా మారాడు. హీరోకి ఉండాల్సిన అన్నీ లక్షణాలు అక్షయ్ లో కనిపిస్తున్నాయి. అయినా కూడా అక్షయ్ హీరోగా కాకుండా వేరే దారిని వెతుక్కున్నాడు. హిందీలో పలు బ్లాక్ బస్టర్ హిట్లు, క్రేజీ వెబ్ సిరీస్‌లకు క్యాస్టింగ్ డైరెక్టర్ గా, అసోసియేట్‌గా వర్క్ చేస్తూ అక్షయ్ బచ్చు అక్కడ ఫుల్ బిజీగా మారిపోయాడు. సత్యమేవ జయతే 2, రుద్ర, రాకెట్ బాయ్స్, ముంబై డైరీస్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు అక్షయ్ క్యాస్టింగ్ విభాగంలో కీలక పాత్ర పోషించి సత్తా చాటాడు.


క్యాస్టింగ్ డైరెక్టర్‌గానే కాకుండా అక్షయ్‌లో ఒక మంచి సింగర్ కూడా ఉన్నాడు. పలు పాపులర్ సాంగ్స్ కవర్ వెర్షన్స్ పాడుతూ, సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తున్నాడు. ఒకప్పుడు కళ్లజోడు పెట్టుకుని, బొద్దుగా అమాయకంగా కనిపించిన ఈ చిన్నోడు.. ఇప్పుడు స్టైలిష్ లుక్‌తో హ్యాండ్సమ్ హీరోలా గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. అక్షయ్ బచ్చుకు సంబంధించిన లేటెస్ట్ ఫొటోలు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మరి త్వరలోనే అక్షయ్ .. హీరోగా మారతాడేమో చూడాలి.

Updated Date - Jul 15 , 2026 | 05:49 PM