సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Director Teja: ఆస్తి కాగితాలపై బలవంతంగా సంతకాలు.. దర్శకుడు తేజ కుమారుడిపై కేసు

ABN, Publish Date - Jan 31 , 2026 | 06:16 AM

సినీ దర్శకుడు తేజ కుమారుడు అమితోవ్ తేజ (Amitov Teja) పై పోలీసు కేసు నమోదైంది.

teja

సినీ దర్శకుడు తేజ కుమారుడు అమితోవ్ తేజ (Amitov Teja) పై పోలీసు కేసు నమోదైంది. బెదిరించి డబ్బు తీసుకోవడంతో పాటు కిడ్నాప్, ఆక్రమ నిర్భందం, మహిళ పట్ల అస భ్యంగా ప్రవర్తించడం వంటి ఆరోపణలపై కోర్టు ఆదేశాల మేరకు అమితోవ్జ, అతని అనుచరులపై జూబ్లీహిల్స్ పోలీసులు శుక్ర వారం కేసులు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

మోతీనగర్ కు చెందిన కె ప్రణీత్ బ్యాంకు క్రెడిట్ కార్డుల పర్యవేక్షణ చేస్తుంటారు. 2025 లో సినీ దర్శకుడు తేజ కుమారుడు అమితోవ్జతో క్రెడిట్ కార్డు దరఖాస్తు విషయంలో ప్రణీతకు పరిచయం ఏర్పడింది. కొద్ది రోజులకు అమితోవ్ తేజ, ప్రణీత్ అతని భార్య కలిసి షేర్ మార్కెట్లో ఓ అకౌంట్ తెరిచి ట్రేడింగ్ చేశారు. తేజ తరఫున ప్రణీత్ ట్రేడింగ్ చేయడం వల్ల సుమారు రూ.11 లక్షలు నష్టం వచ్చింది.

ఈ నష్టాన్ని పూడ్చేం దుకు మరికొంత డబ్బు పెట్టాలని ప్రణీత్పై అమితావ్ తేజ ఒత్తిడి తీసుకువచ్చాడు. అందుకు ప్రణీత్ నిరాకరించడంతో 2025, మే 4న అమితోవ్ తేజ అనుచరులు (మణి కుమార్, రామ్ నాథ్ రెడ్డి, లక్ష్మీకాంత్రెడ్డి) ఆక్ర మంగా అతన్ని నిర్బందించారు. ఖాళీ పేపర్లు, చెక్కులపై బలవంతంగా సంతకాలు చేయిం చుకోవడమే కాకుండా అతని భార్యతో ఆస్తి కాగితాలపై సంతకాలు చేయించుకున్నారు..

ఈ విషయంలో ప్రణీత్ రెండు నెలల క్రితం నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో జూబ్లీహిల్స్ పోలీసులు వారిపై శుక్రవారం కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా ట్రేడింగ్లో పెట్టుబడి పేరిట ప్రణీత్, అతని భార్య రూ.72లక్షలు మోసం చేశారని ఆమితోవ్ తేజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీ హిల్స్ పోలీసులు ఇరవై రోజుల క్రితం కేసు నమోదు చేసిన విషయం విదితమే.

Updated Date - Jan 31 , 2026 | 07:17 AM