సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఓర్నీ ట్రైలర్ లేకుండా ఇన్ని సినిమాలు వచ్చాయా.. అంటే ప్యారడైజ్ పరిస్థితి అంతేనా

ABN, Publish Date - Sep 13 , 2026 | 09:17 PM

ఇండస్ట్రీలో ఒక్క సినిమాకు ఒక్కో స్టైల్ ఉంటుంది. ఆ సినిమా కథని, జానర్ ని ప్రేక్షకులకు అర్ధమయ్యేలా చేయగలిగేది ట్రైలర్ మాత్రమే. ఆ ట్రైలర్ తోనే సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తారు మేకర్స్.

The Paradise

ఇండస్ట్రీలో ఒక్క సినిమాకు ఒక్కో స్టైల్ ఉంటుంది. ఆ సినిమా కథని, జానర్ ని ప్రేక్షకులకు అర్ధమయ్యేలా చేయగలిగేది ట్రైలర్ మాత్రమే. ఆ ట్రైలర్ తోనే సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తారు మేకర్స్. అలాంటి ట్రైలర్ లేకుండా సినిమా రిలీజ్ చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుంది..? ప్యారడైజ్ ఇలాంటి రిస్కే చేస్తుంది. నేచురల్ స్టార్ నాని కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ది ప్యారడైజ్. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తో కలసి దసరా తర్వాత నాని చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సెప్టెంబర్ 24న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న తరుణంలో, చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేయడం లేదని ప్రకటించడం సినీ ప్రియులకు, బయ్యర్లకు కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. సాధారణంగా ఏ పెద్ద సినిమాకైనా థియేట్రికల్ ట్రైలరే వ్యాపారానికి, ఓపెనింగ్స్‌కు ప్రధాన ఆధారంగా ఉంటుంది.


అయితే ట్రైలర్ కట్ చేయకపోవడం వెనుక నిర్మాతల కాన్ఫిడెన్స్ లేకపోవడం కాదని, కేవలం సమయాభావమేనని నాని స్వయంగా మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. సినిమా ఆఖరి పనుల్లో పడి దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, సంగీత దర్శకుడు అనిరుధ్ పగలు రాత్రి కష్టపడుతున్నారని, ఈ సమయంలో ట్రైలర్ కోసం ప్రత్యేకంగా 4-5 రోజులు కేటాయిస్తే ఫైనల్ ప్రాడక్ట్ క్వాలిటీపై ప్రభావం పడుతుందనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. హడావుడిగా ఏదో ఒక ట్రైలర్ కట్ చేసి సినిమాపై ఉన్న మంచి అంచనాలను దెబ్బతీసుకోవడం కంటే, నేరుగా థియేటర్లలోనే పవర్ ఫుల్ కంటెంట్‌ను చూపించడమే మేలని టీమ్ భావించింది


అయితే ప్యారడైజ్ కన్నా ముందే ఇండస్ట్రీలో ట్రైలర్ లేకుండా సినిమాలను రిలీజ్ చేశారు. ఆ సినిమాలు ఏంటి.. ? వాటి రిజల్ట్ ఏంటి.. ? అని చూద్దాం. సావిత్రి బయోపిక్‌గా వచ్చిన మహానటి చిత్రానికి టీజర్ మాత్రమే ఇచ్చి, ఎలాంటి ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి తెచ్చారు.టీజర్ రిలీజ్ అప్పుడే నెగిటివిటీ రావడంతో ట్రైలర్ లేకుండా సినిమాని రిలీజ్ చేశారు. ఆ సినిమా ఎలాంటి సంచలన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. అలాగే విజయ్ దేవరకొండను స్టార్‌గా నిలబెట్టిన గీత గోవిందం సినిమా కూడా ఎలాంటి థియేట్రికల్ ట్రైలర్ లేకుండానే కేవలం పాటలు, ప్రోమోల బజ్ మీద వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. అయితే తమిళ్ లో వచ్చిన మాస్టర్, కబాలి చిత్రాలు మాత్రం భారీ పరాజయాన్ని అందుకున్నాయి.


ప్రస్తుతం ది ప్యారడైజ్ చిత్రానికి ఇప్పటికే కావాల్సినంత పాజిటివ్ బజ్, క్రేజ్ ఉన్నాయి. టీజర్ ద్వారా సినిమా మూడ్ ఏంటో ప్రేక్షకులకు ఇప్పటికే ఒక స్పష్టత వచ్చింది. సమయం లేని పరిస్థితుల్లో క్వాలిటీ లేని ట్రైలర్ ఇచ్చి నెగెటివిటీ తెచ్చుకోవడం కన్నా, థియేటర్లోనే నేరుగా విజ్యువల్ వండర్‌ను ఆస్వాదించేలా చేయడం అత్యంత తెలివైన స్ట్రాటజీ అని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ది ప్యారడైజ్.. తెలుగు సినిమాల్లా హిట్ అందుకుంటుందో.. తమిళ్ సినిమాల్లా ప్లాప్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

Updated Date - Sep 13 , 2026 | 09:17 PM