ఫిష్ వెంకట్ మరణం.. ప్రభాసే కారణం
ABN , Publish Date - May 09 , 2026 | 05:06 PM
ప్రభాస్ (Prabhas) సాయం చేస్తాడనే ఫేక్ ప్రచారం వలనే తన భర్త ఫిష్ వెంకట్ (Fish Venkat) మరణించాడని ఆయన భార్య సువర్ణ ఆరోపించడం సంచలనంగా మారింది.
ప్రభాస్ (Prabhas) సాయం చేస్తాడనే ఫేక్ ప్రచారం వలనే తన భర్త ఫిష్ వెంకట్ (Fish Venkat) మరణించాడని ఆయన భార్య సువర్ణ ఆరోపించడం సంచలనంగా మారింది. కామెడీ విలన్ గా ఫిష్ వెంకట్ ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇక గతేడాది అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ జూలై 18 న మరణించాడు. అయితే తన భర్త చావుబతుకుల మధ్య ఉన్నాడని, తమ వద్ద డబ్బులు లేవని, ఎవరైనా ఇండస్ట్రీకి సంబంధించినవాళ్ళు ఆర్థిక సహాయం చేయాలని ఫిష్ వెంకట్ భార్య కోరింది.
ఇక ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ పీఆర్ టీమ్.. సువర్ణతో ఫోన్ కాల్ మాట్లాడి.. ఫిష్ వెంకట్ చికిత్స కోసం రూ. 50 లక్షలు పంపిస్తున్నట్లు తెలిపారని వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని సువర్ణ కూడా మీడియా ముందు చెప్పింది. ఆ తరువాత కేవలం కాల్ మాత్రమే వచ్చిందని, డబ్బులు రాలేదని, ఆ డబ్బు లేకనే వెంకట్ మరణించాడని ఆమె తెలిపింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో సువర్ణ మరోసారి తన భర్త మరణానికి ప్రభాస్ పేరు బయటకు రావడమే కారణమని తెలిపింది.
తాజాగా ఫిష్ వెంకట్ భార్య సువర్ణ మాట్లాడుతూ “ప్రభాస్ సాయం చేశాడనే వార్తలు రావడంతో ఇతరులు సహాయం చేయడం ఆపేశారు. ఆ ఫేక్ న్యూస్ రాకపోయి ఉంటే నా భర్త బతికి ఉండేవాడు. కనీసం ప్రభాస్ అయినా చూసి.. నేనేం చేయకుండా నా పేరు చెప్తున్నారని వారి మీద యాక్షన్ తీసుకున్నారా అంటే.. లేదు. ఆయన కూడా పట్టించుకోలేదు. ఒకవేళ ప్రభాస్ పేరు బయటకు రాకపోయి ఉంటే.. ఎవరైనా హెల్ప్ చేసేవారు. అలా చేసి ఉంటే మా అయన ఇప్పుడు బ్రతికి ఉండేవాడు. ఆ న్యూస్ బయటకు వచ్చేసరికి ఎవరు డబ్బులు వేయలేదు' అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సువర్ణ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వ్యాఖ్యలపై ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ విషయం కనీసం ప్రభాస్ కి కూడా తెలిసి ఉండదు. అలాంటప్పుడు ప్రభాస్ పై నిందలు వేయడం కరెక్ట్ కాదని ఫ్యాన్స్ అంటున్నారు.