Lenin: అఖిల్.. లెనిన్ నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది
ABN, Publish Date - Jan 02 , 2026 | 06:46 AM
న్యూ ఇయర్ సందర్భంగా టాలీవుడ్ సినిమాలకు సంబంధించిన వరుస అప్డేట్స్ వస్తుండగా, లెనిన్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ కూడా అధికారికంగా వెలువడింది.
టాలీవుడ్‌లో అక్కినేని కుటుంబానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మూడు తరాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ ఫ్యామిలీ నుంచి నాగార్జున వారసులుగా నాగచైతన్య, అఖిల్ హీరోలుగా కొనసాగుతున్నారు. నాగచైతన్య కెరీర్ పరంగా స్థిరంగా ముందుకు సాగుతుంటే, అఖిల్ (Akhil Akkineni)మాత్రం ఇప్పటికీ సరైన కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు పదేళ్లు పూర్తైనా, అఖిల్ ఖాతాలో ఇప్పటివరకు చెప్పుకోదగ్గ హిట్ మాత్రం లేదు. ఈ నేపథ్యంలోనే ఈసారి ఎలాగైనా భారీ హిట్ కొట్టాలనే పట్టుదలతో తన తదుపరి చిత్రం ‘లెనిన్’ (Lenin) పై పూర్తి ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. కెరీర్ ఆరంభం నుంచి సరై హిట్ కోసం చూస్తున్న ఈ అక్కినేని వారసుడు అఖిల్ సినిమా నుంచి ఎట్టకేలకు ఓ అప్డేట్ వచ్చింది.
రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, నాగ వంశీ కలిసి నిర్మిస్తుండడం విశేషం.అయితే దాదాపు ఏడాదిన్నరకు పైగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ, హీరోయిన్లు మారుతూ వస్తోంది. ప్రస్తుతం దాదాపు షూటింగ్ పూర్తయిన ఈ చిత్రాన్ని మార్చి నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.
అందుకే ఇక ఆలస్యం చేయకుండా ప్రమోషన్లను స్టార్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తొలుత న్యూ ఇయర్ సందర్భంగా టాలీవుడ్‌లో వరుస మూవీ అప్డేట్స్ వస్తుండగా, ‘లెనిన్’ టీమ్ కూడా తమ అప్డేట్‌ను బయటకు తీసుకొచ్చింది. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ జనవరి 5న విడుదల కాబోతుందని అధికారికంగా పోస్టర్ విడుదల చేసి ప్రకటించారు. ఇదిలాఉంటే ఈ వేసవిలో ఈ చిత్రం రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో, మ్యూజిక్‌తోనే హైప్ క్రియేట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ మూవీలో శ్రీలీల స్థానంలో భాగ్య శ్రీ భోర్సే (Bhagyashri Borse)ని కథానాయికగా తీసుకుని రీ షూట్ చేశారు.. తమన్ (Thaman) సంగీతం అందిస్తున్నాడు.