మార్చి 5న నెవర్ బిఫోర్ మిథికల్ థ్రిల్లర్ 'వృషకర్మ' ఫస్ట్ గ్లింప్స్
ABN, Publish Date - Feb 25 , 2026 | 07:04 PM
నాగ చైతన్య, కార్తీక్ దండు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'వృషకర్మ' మూవీ ఫస్ట్ గ్లింప్స్ మార్చి 5న రాబోతోంది. ఈ విషయాన్ని తెలియచేస్తూ విడుదల చేసిన పోస్టర్ చైతు అభిమానులను ఆకట్టుకుంటోంది.
'తండేల్' (Thandel) గ్రాండ్ విక్టరీ తర్వాత యువ సమ్రాట్ నాగ చైతన్య (Naga Chaitanya), 'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ దండు (Karthik Dandu) తో కలిసి ప్రతిష్ఠాత్మక మిథికల్ థ్రిల్లర్ మూవీ 'వృషకర్మ' (Vrushakarma) చేస్తున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎస్.వి.సి.సి., సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి, బాపినీడు ఈ ప్రాజెక్ట్‌ను సమర్పిస్తున్నారు. ఇప్పటికీ విడుదలైన బిహైండ్ ది సీన్ వీడియోస్, ఫస్ట్ లుక్‌తో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.
తాజా ఈ మూవీ మేకర్స్ ఫస్ట్ గ్లింప్స్ గురించి అప్‌డేట్ ఇచ్చారు. 'వృషకర్మ' ఆధ్యాత్మిక ప్రపంచంలోకి మొదటి స్నీక్ పీక్ ద్వారా మార్చి 5న అడుగుపెట్టవచ్చని వారు తెలిపారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో నాగ చైతన్య ఒక చీకటి గుహలో నిలబడి, పైనుండి దూసుకు వస్తున్న పదునైన కాంతి కిరణాలతో తడిసి ముద్దవుతున్నట్లు కనిపిస్తోంది. అతని కండలు తిరిగిన శరీరం, ఇంటెన్స్ లుక్ ఆకర్షణీయంగా వుంది. నడుముకు కట్టుకున్న క్లైంబింగ్ గేర్, చేతిలో ఉన్న తవ్వే ఆయుధం అతని పాత్ర ఎంత ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్లిందో సూచిస్తున్నాయి. చుట్టూ ఉన్న రాళ్లు, తాళ్లు, అసమానమైన భూభాగం ఈ కథలో అడ్వెంచర్, థ్రిల్ స్థాయిని మరింత పెంచుతున్నాయి. ఈ పాత్ర కోసం నాగ చైతన్య మ్యాసీవ్ ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యారు. రా, రగ్గడ్ లుక్ కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుని, అనేక థ్రిల్లింగ్ స్టంట్స్ ను స్వయంగా చేస్తున్నారు. దర్శకుడు కార్తిక్ దండు తన బ్లాక్‌బస్టర్ డెబ్యూ 'విరూపాక్ష' తర్వాత వస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఉన్న అంచనాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.