Devara 2: ఫ్యాన్స్ వెయిటింగ్‌కు.. ఎండ్ కార్డ్? కథలో మార్పులకు.. ఓకే చెప్పిన తారక్?
ABN, Publish Date - Sep 28 , 2026 | 06:27 PM
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో రానున్న ‘దేవర-2’పై లేటెస్ట్ అప్‌డేట్ వైరల్ అవుతోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (ntr), కొరటాల శివ (koratal siva) కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ హిట్ మూవీ దేవర (Devara) 'ఆర్‌ఆర్‌ఆర్' వంటి గ్లోబల్ హిట్ తర్వాత వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. డ్యూయల్ రోల్‌లో ఎన్టీఆర్ పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్, సముద్రం నేపథ్యంలో కొరటాల ఆవిష్కరించిన సరికొత్త విజన్, అనిరుధ్ అందించిన మైండ్ బ్లాకింగ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కలిసి ఈ సినిమాను ఒక వండర్‌గా మార్చాయి. జాన్వీ కపూర్ గ్లామర్, సైఫ్ అలీ ఖాన్ విలనిజం సినిమాకు మరింత ప్లస్ అయ్యాయి. అయితే, ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్‌లోనే 'దేవర-2' ఉంటుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి నందమూరి అభిమానులు 'దేవర-2' ఎప్పుడు మొదలవుతుందా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి ఒక క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది.
ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం.. 'దేవర-2' షూటింగ్ వచ్చే ఏడాది చివరి నాటికి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ పాటికే ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకుని, సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈ సినిమా కాస్త ఆలస్యమైంది. దీనికి కారణం.. కొరటాల శివ సిద్ధం చేసిన పూర్తి కథపై తారక్ అంతగా సంతృప్తి చెందలేదని గతంలో వార్తలు వచ్చాయి. ఫస్ట్ పార్ట్ సాధించిన విజయం దృష్ట్యా, సీక్వెల్ అంతకుమించి ఉండాలని తారక్ భావించారట. దాంతో దర్శకుడు తన టీమ్‌తో కలిసి కథలో కీలక మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది. అయితే, కొత్త వర్షన్ కథ ఎన్టీఆర్‌కు బాగా నచ్చిందని, దీంతో వచ్చే ఏడాది చివరి నాటికి ఈ ప్రాజెక్ట్‌ను ఎలాగైనా పట్టాలెక్కించాలని మేకర్స్ భావిస్తున్నట్లు టాక్.
అయితే, ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. 'దేవర-2' మొదలవ్వాలంటే ముందుగా తారక్ చేతిలో ఉన్న లైనప్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'డ్రాగన్' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది. 'డ్రాగన్' పూర్తయిన వెంటనే, తారక్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో భారీ ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టనున్నారు. 'అరవింద సమేత' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరి కాంబోలో వస్తున్న ఈ సినిమా ఒక పౌరాణిక నేపథ్యంలో, ఊహించని రేంజ్‌లో రాబోతుందట. ఈ రెండు భారీ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతే తారక్ 'దేవర-2' కోసం డేట్స్ కేటాయించే అవకాశం ఉంది.
మరోవైపు దర్శకుడు కొరటాల శివ కూడా నటసింహం నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ప్రారంభం కావాల్సిన ఈ సినిమా, బాలయ్యకు గాయం కావడంతో కాస్త ఆలస్యమైంది. అయితే ఈ అక్టోబర్ నుంచే బాలయ్య, కొరటాల శివ కాంబో మూవీ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి విడుదల చేయాలని కొరటాల భావిస్తున్నారు. అంటే, అటు ఎన్టీఆర్ తన కమిట్‌మెంట్స్ పూర్తి చేసుకుని, ఇటు కొరటాల శివ బాలయ్య సినిమాను పూర్తి చేసిన తర్వాతే 'దేవర-2' పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. మరి వచ్చే ఏడాది చివరికైనా 'దేవర-2' సెట్స్ పైకి వెళ్తుందా? లేదా ఈ వార్తలు కేవలం రూమర్లుగానే మిగిలిపోతాయా అనేది చూడాలి.