పుష్ప 3.. 2030 తర్వాతే! అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు నిరాశేనా?
ABN, Publish Date - Jul 16 , 2026 | 09:19 PM
అల్లు అర్జున్ - మళయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్ కాంబోలో ఓ మూవీ సెట్ అయిందట. మంచిదే!. బన్నీ వరుసగా పరభాషా దర్శకులతోనే సాగితే, టాలీవుడ్ డైరెక్టర్స్ తో వర్క్ చేసేది ఎప్పుడు అన్నదే ఇప్పటి డిస్కషన్. అదీ సంగతి!
అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం 'ఐకాన్ స్టార్'గా ఆల్ ఇండియాలో తనకంటూ ఓ స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్నారు. తన పరిధిని మరింత విస్తృత పరచుకోవడానికి తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) దర్శకత్వంలో 'రాకా'లో నటిస్తున్నారు. ఈ మూవీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో రూపొందుతోందని సమాచారం. రాకా (Raka) కాగానే మరో తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో బన్నీ సినిమా మొదలు కానుంది. ఇదిలా ఉండగానే మళయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్ (Basil Joseph) నిర్దేశకత్వంలోనూ బన్నీ నటించడానికి అంగీకరించారని తెలుస్తోంది. వాస్తవానికి తెలుగు నేలపైనే కాదు కేరళలోనూ అల్లు అర్జున్ కు మంచి క్రేజ్ ఉంది. అందుకే జనం 'మల్లూ అర్జున్' అనీ పిలుస్తుంటారు. ఈ నేపథ్యంలోనే మళయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్‌తో బన్నీ నటించడం విశేషంగా మారింది. అయితే ఈ ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తయ్యే సరికి మరో మూడేళ్ళు పడుతుందని టాక్. మరి అందరూ పరభాషా దర్శకులతోనే సాగితే తనను 'ఐకాన్ స్టార్'గా నిలిపిన టాలీవుడ్ డైరెక్టర్స్ తో బన్నీ కలసి పనిచేసేదెప్పుడు అన్నదే చర్చ.
పుష్ప 3 @20303
అల్లు అర్జున్ 'ఐకాన్ స్టార్'గా మారడానికి ఆయన స్టైలిష్ యాక్టింగ్, యాక్షన్ ఎపిసోడ్స్ లో ఆయన చూపించే డెడికేషన్, డాన్సుల్లో ఈజ్ అన్నీ కారణమని చెప్పవచ్చు. అయితే బన్నీని అలా తీర్చిదిద్దినవారందరూ తెలుగు దర్శకులే అని మరువరాదు. బన్నీ కెరీర్ లో తొలిసారి 'హ్యాట్రిక్' లభించింది తెలుగు దర్శకుల ద్వారానే. అలా ఆయనకు వరుసగా మూడు ఘనవిజయాలను అందించిన చిత్రాలు త్రివిక్రమ్ తెరకెక్కించిన 'అల వైకుంఠపురములో', సుకుమార్ రూపొందించిన 'పుష్ప' సిరీస్ అని చెప్పక తప్పదు. పైగా పుష్ప (Pushpa) సినిమా మూడో భాగంలోనూ బన్నీ నటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వరుసగా అల్లు అర్జున్ పరభాషా దర్శకులతోనే సాగితే, మరి తెలుగు వారితో పనిచేసేదెప్పుడు అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది కదా! అంతేగాక వచ్చే యేడు ప్రారంభం అవుతుందనుకుంటున్న పుష్ప 3 మరింత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అట్లీతో రాకా తర్వాత లోకేశ్, బసిల్ సినిమాలు ఉండడంతో సుకుమార్ (Sukumar)తో పుష్ప3 పరిస్థితి ఏంటనేది ఇప్పుడు అయోమయంలో పడింది. అంతేగాక ప్రస్తుతం ఉన్న సిట్యువేషన్‌ను చూస్తే 2030 తర్వాత మాత్రమే పుష్పరాజ్ ఆగమనం ఉంటుదనేది స్పష్టం అవుతోంది. అయితే. ఫ్చాన్స్ అప్పటివరకు వేచి ఉండగలరా లేదా అనేదే ఇప్పుడు వెయ్యి డాలర్ల ప్రశ్న.
ముందుగా ఎవరితో..?
అల్లు అర్జున్, అట్లీ కాంబోలో రూపొందే 'రాకా' చిత్రం ప్రస్తుతానికి 2027 డిసెంబర్‌లో వస్తుందని తెలుస్తోంది. ఈ మూవీలో బన్నీ నాలుగు పాత్రల్లో కనిపిస్తారని టాక్.. అంతేకాదు సైన్స్ ఫిక్షన్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో వీఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువగా ఉంటుందట. ఒకవేళ వీఎఫ్ఎక్స్ కారణంగా 'రాకా' ఆలస్యమైతే 2028లోనే వెలుగు చూస్తుంది. ఆ తరువాత మరో రెండేళ్ళకు లోకేశ్ కనగరాజ్ మూవీ, బాసిల్ జోసెఫ్ సినిమాలు వరుసగా వెలుగు చూసే అవకాశం ఉంది. అందువల్ల మరో మూడేళ్ళ వరకు బన్నీ తెలుగు దర్శకులతో పనిచేయరని తెలుస్తోంది. తనను 'ఐకాన్ స్టార్'గా నిలిపిన తెలుగు డైరెక్టర్స్ ను పక్కన పెట్టి బన్నీ వరుసగా పరభాషా దర్శకులతో సాగడానికి కారణమేంటో, ఆయన సినిమాలు విడుదలయితేనే కానీ తెలియదు. మరి ఈ మూవీస్ అయ్యాక బన్నీ ఏ తెలుగు డైరెక్టర్ తో ముందుగా వర్క్ చేస్తారో చూడాలి.