స్లీప్ వాకింగ్ కాన్సెప్ట్ సైకలాజికల్ థ్రిల్లర్.. ‘ఫైట్ మహా’
ABN, Publish Date - Aug 19 , 2026 | 08:05 AM
సునీల్, అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రధారులుగా ఆనంద్ చంద్ర (Anand Chandra) తెరకెక్కించిన చిత్రం ‘ఫైట్ మహా’.
సునీల్, అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రధారులుగా ఆనంద్ చంద్ర (Anand Chandra) తెరకెక్కించిన చిత్రం ‘ఫైట్ మహా’ (Fight Maha ). ‘కలలు నిజమైతే నిజం ఎవరిది’ అనేది దీని ఉపశీర్షిక. న్యూ ఐ మూవీస్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై ఏవీఎస్ రాజు, ఆర్ కుమార్ రాజు, ఆనంద్ చంద్ర నిర్మించారు.
సినిమా ఈనెల 21వ తేదీన విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత ఏవీఎస్ రాజు మాట్లాడుతూ ‘వైజాగ్, కేరళ, హైదరాబాద్‌లో ఈ సినిమాను చిత్రీకరించాం. ఇటీవల మేము రిలీజ్ చేసిన టీజర్‌కు మిలియన్ ప్లస్ ప్యూస్‌తో అద్భుతమైన స్పందన వచ్చింది’ అని చెప్పారు.
దర్శకుడు ఆనంద్ చంద్ర మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో మేము చూపించిన స్లీప్ వాకింగ్ అనే కాన్సెప్ట్ చాలా యూనిక్‌గా ఉంటుంది. గతంలో ఇలాంటి కాన్సెప్ట్‌తో సినిమాలు వచ్చినా, మన తెలుగు ప్రేక్షకులకు మాత్రం కొత్తగా ఉంటుంది. ఒక వినూత్నమైన సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రమిది’ అని అన్నారు.