సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

రాకా.. అంతమంది హీరోయిన్లు ఎందుకురా బుజ్జి

ABN, Publish Date - Jun 02 , 2026 | 06:53 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం నటిస్తోన్న చిత్రం రాకా (Raaka). కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

Raaka

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం నటిస్తోన్న చిత్రం రాకా (Raaka). కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్, గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. దీపికాతో పాటు.. మరో నలుగురు హీరోయిన్లు రాకాలో నటిస్తోన్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి.


దీపికా కాకుండా రష్మిక మందన్నా, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ కీలకపాత్రలో నటిస్త. మేకర్స్ అధికారికంగా ప్రకటించినప్పటికీ వీరు రాకా షూటింగ్ లో పాల్గొంటున్నారని టాక్. ఇక బన్నీ సరసన 4 టాప్ స్టార్ హీరోయిన్స్ అనుకుంటే పొరపాటే.. తాజాగా రాకాలోకి మరో బ్యూటీ వచ్చి చేరింది. ఈసారి టాలీవుడ్, బాలీవుడ్ కాకుండా.. మాలీవుడ్ బ్యూటీని దింపాడు అట్లీ. మిన్నల్ మురళి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఫెమినా జార్జ్ రాకాలో ఒక చిన్న పాత్రలో నటిస్తోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలిపింది.


' రాకా లాంటి సినిమాలు నేను కూడా భాగమవుతానని అనుకోలేదు. నా కెరీర్ లో ఈ సినిమా చాలా పెద్దది. నా పాత్ర చిన్నదే అయినా కూడా ఇందులో నేను భాగమయ్యినందుకు ఎంతో ఆనందంగా ఉంది' అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఫెమినా.. రాకాలో నటిస్తోందని కన్ఫర్మ్ చేసింది. ఇక అమ్మడితో కలుపుకొని బన్నీ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు. ఈ విషయం తెలియడంతో నెటిజన్స్ అంతమంది హీరోయిన్లు ఎందుకురా బుజ్జి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో బన్నీ- అట్లీ ఎలాంటి రికార్డులు సృష్టిస్తారో చూడాలి.

Updated Date - Jun 02 , 2026 | 07:09 PM