Sumanth: ‘మహేంద్రగిరి వారాహి’లో.. ఊహించని సన్నివేశాలుంటాయి
ABN, Publish Date - Jul 28 , 2026 | 08:43 AM
సుమంత్, ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రధారులుగా సంతోష్ జాగర్లపూడి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘మహేంద్రగిరి వారాహి’ .
సుమంత్ (Sumanth), ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh) ప్రధాన పాత్రధారులుగా సంతోష్ జాగర్లపూడి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘మహేంద్రగిరి వారాహి’ (Mahendragiri Varahi) . రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిల్మ్స్ బ్యానర్లపై కలిపు మధు, లక్ష్మణ్ నిర్మిస్తున్నారు. సోమవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఈ సినిమాను సెప్టెంబరు 11న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఈ సందర్భంగా హీరో సుమంత్ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో సర్‌ప్రైజ్ ట్విస్టులు, ఊహించని సన్నివేశాలు, ఆసక్తికరమైన మలుపులు ఉంటాయి. ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా సినిమా ఉంటుంది’ అని అన్నారు.
దర్శకుడు సంతోష్ జాగర్లపూడి (Santosh Jagarlapudi) మాట్లాడుతూ ‘టీజర్‌లో చూసిన దానికంటే సినిమాలోని కంటెంట్ మరింత అద్భుతంగా ఉంటుంది’ అని చెప్పారు. ఈ సినిమా నుంచి ప్రేక్షకులు ఊహించని రెండు అద్భుతమైన పాటలు రాబోతున్నాయని నిర్మాత మధు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ నటి మంజు భార్గవి తదితరులు పాల్గొన్నారు.