ఫౌజీ: లీక్స్‌తో ఆ మ్యాజిక్ చెడగొట్టవద్దు.. ప్లీజ్
ABN, Publish Date - Apr 05 , 2026 | 06:34 PM
నెటిజన్లకు, సోషల్ మీడియా లీకు వీరులకు ‘ఫౌజీ’ (Fauzi) టీమ్ మాస్ వార్నింగ్ ఇచ్చింది. తాజాగా ఈ చిత్రంలో హీరో లుక్ ఎలా ఉంటుందో తెలియజేసేలా కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి.
నెటిజన్లకు, సోషల్ మీడియా లీకు వీరులకు ‘ఫౌజీ’ (Fauzi) టీమ్ మాస్ వార్నింగ్ ఇచ్చింది. తాజాగా ఈ చిత్రంలో హీరో లుక్ ఎలా ఉంటుందో తెలియజేసేలా కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. దీనిపై చిత్ర బృందం స్పందించింది. ఈ చర్యలకు పాల్పడుతున్న వారికి మాస్ వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు నిర్మాణ సంస్థ, దర్శకుడు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
‘ఫౌజీ’ సినిమా సెట్ నుంచి లీక్ అయిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా కొందరు వైరల్ చేయడం మా దృష్టికి వచ్చింది. ఇలాంటి చర్యలు చేస్తున్న వారికి ఇదొక హెచ్చరిక. అనధికారిక కంటెంట్‌పై మేం ఫిర్యాదు చేస్తాం. చర్యలు తీసుకుంటాం. తెలిసీ తెలియక చేసే ఇలాంటి లీకుల వల్ల మా పనిపై ప్రభావం చూపుతున్నాయి. వెండితెరపై ఒకఅద్భుతాన్ని ప్రేక్షకులకు చూపించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. మీ వెయిటింగ్‌కు మేం మంచి ఫలితాన్ని ఇస్తాం. దయచేసి ఇలా అనధికారికంగా బయటకు వచ్చిన కంటెంట్‌ను ఎక్కడా షేర్ చేయకండి’ అని ఫౌజీ టీమ్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
దర్శకుడు హను రాఘవపూడి (hanu Raghvapudi) కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. ‘మీకు గుర్తుండిపోయేలా ఒక విశేషమైన కథను చూపించడానికి మా టీమ్ అంతా ఉంతో కృషి చేస్తుంది. లీక్స్‌తో ఆ మ్యాజిక్ చెడగొట్టవద్దు. దయచేసి ఇలాంటి లీకులు చేయవద్దని విన్నపిస్తున్నాం’ అని కోరారు.
ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఇమాన్నీ కథానాయిక. 1940ల నేపథ్యంలో సాగే పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ కీలక పాత్రధారులు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.