సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

FAS Film Awards: మురళీమోహన్‌కు NTR.. శ్రీకాంత్‌కు ANR అవార్డులు

ABN, Publish Date - Aug 09 , 2026 | 10:17 PM

30వ ఫాస్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. మురళీమోహన్, శ్రీకాంత్, బాబూమోహన్, అన్నపూర్ణమ్మ సహా పలువురు సినీ ప్రముఖులు అవార్డులు అందుకున్నారు.

FAS Film Awards

30వ ఫిల్మ్‌ అండ్‌ క్రిటిక్స్‌ సొసైటీ (ఫాస్‌) ఫిల్మ్‌ అవార్డుల (FAS Film Awards 2026) ప్రదానోత్సవం ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ నగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో ఘనంగా జరిగింది. వంశీ ధర్మారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులకు ప్రతిష్ఠాత్మక అవార్డులను అందజేశారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ అవార్డును ప్రముఖ నటుడు మురళీమోహన్‌ అందుకున్నారు. ఏఎన్నార్‌ అవార్డును నటుడు శ్రీకాంత్‌ స్వీకరించారు. ఈ పురస్కారాలను రేలంగి నరసింహారావు, మాదాల రవి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ చేతుల మీదుగా అందజేశారు.

కాంతారావు అవార్డును నటుడు నరసింహరాజుకు, దాసరి అవార్డును నటుడు బాబూమోహన్‌కు అందించారు. హేమలత అవార్డును నటి అన్నపూర్ణమ్మ, గీతాంజలి అవార్డును నటి హేమ, పండరిబాయి అవార్డును నటి రజిత అందుకున్నారు. అలాగే రాజబాబు అవార్డును అనంత్‌, పద్మనాభం అవార్డును గౌతంరాజు, జూనియర్‌ వేణుమాధవ్‌ అవార్డును రచ్చ రవి అందుకున్నారు.

ఈ కార్యక్రమంలో సీనియర్‌ పాత్రికేయుడు, ఆంధ్రజ్యోతి చీఫ్‌ రిపోర్టర్‌ వినాయకరావుకు జీవన సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. సినీ రంగానికి, పాత్రికేయ రంగానికి విశిష్ట సేవలు అందించిన వారిని ఈ సందర్భంగా నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.

Updated Date - Aug 09 , 2026 | 10:17 PM