రామ్ - భాగ్యశ్రీ ప్రేమాయణం నిజమే.. ఇదిగో క్లారిటీ
ABN, Publish Date - Jun 21 , 2026 | 04:11 PM
ఇండస్ట్రీలో పుకార్లు అనేవి సర్వసాధారణం. హీరోహీరోయిన్స్ కలిసి కనిపిస్తే వారిమధ్య ప్రేమాయణం నడుస్తోందని వార్తలు పుట్టుకొస్తాయి. అయితే వాటిలో కొన్ని ప్రేమకథలు నిజంగా కూడా అయ్యాయి.
ఇండస్ట్రీలో పుకార్లు అనేవి సర్వసాధారణం. హీరోహీరోయిన్స్ కలిసి కనిపిస్తే వారిమధ్య ప్రేమాయణం నడుస్తోందని వార్తలు పుట్టుకొస్తాయి. అయితే వాటిలో కొన్ని ప్రేమకథలు నిజంగా కూడా అయ్యాయి. అలా ఈ మధ్య రూమర్స్ తో మొదలై పెళ్లితో ముగిసిన జోడీ విజయ్ దేవరకొండ- రష్మిక. ఈ కన్నడ బ్యూటీ ఎట్టకేలకు తెలుగింటి కోడలిగా మారింది. ఇక తాజాగా మరో భామ తెలుగింటి కోడలు కాబోతుందా..? అంటే నిజమే అని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ అందం మరెవరో కాదు భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse).
మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు తెరకు పరిచేయమైన ఈ భామ మొదటి సినిమాతోనే విజయాన్ని అందుకోలేకపోయినా.. ప్రేక్షకుల గుండెల్లో స్థానాన్ని మాత్రం సంపాదించుకుంది. ఆ తరువాత రామ్ పోతినేని సరసన ఆంధ్రా కింగ్ తాలూకాలో నటించింది. ఈ సినిమా కూడా విజయాన్ని అందించలేదు కానీ.. ప్రేమను అందించింది. గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీ సర్కిల్స్‌లో రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సేల మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ విపరీతమైన ప్రచారం జరుగుతోన్న విషయం తెల్సిందే. భాగ్యశ్రీ కోసమే రామ్ లిరిసిస్ట్ గా, సింగర్ గా మారాడని కూడా టాక్ నడిచింది. అయితే ఈ వార్తలను రామ్ కొట్టిపడేశాడు. కానీ, భాగ్యశ్రీ మాత్రం రామ్ తో రిలేషన్ గురించి గట్టి హింట్ ఇచ్చేసింది.
తాజాగా సుమ టాక్ షోలో భాగ్యశ్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఆమె నటిస్తోన్న లెనిన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అఖిల తో కలిసి సుమ టాక్ షోలో పాల్గొన్న భాగ్యశ్రీ ' నా మొదటి ఇల్లు ఔరంగాబాద్.. నా సెకండ్ హోమ్ హైదరాబాద్.. ఆల్రెడీ ఉంది" అని చెప్పింది . ఈ ఒక్క స్టేట్‌మెంట్‌తో రామ్ అభిమానులు, నెటిజన్లు వీరిద్దరి మధ్య ప్రేమ నిజమేనని సోషల్ మీడియా వేదికగా కన్ఫర్మ్ చేసేస్తున్నారు. మరి త్వరలోనే రామ్ - భాగ్యశ్రీ పెళ్లి కబురు చెప్తారేమో చూడాలి.