సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఏంటి.. పెళ్ళి తరువాత సామ్ ఇలా మారిపోయింది..

ABN, Publish Date - May 09 , 2026 | 01:00 PM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతేడాది చివర్లో ఆమె.. డైరెక్టర్ రాజ్ నిడిమోరు (Raj Nidimoru) ను రెండో వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన విషయం తెల్సిందే.

Samantha

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతేడాది చివర్లో ఆమె.. డైరెక్టర్ రాజ్ నిడిమోరు (Raj Nidimoru) ను రెండో వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన విషయం తెల్సిందే. పెళ్ళి తరువాత సామ్ లో చాలా మార్పులు వచ్చాయి. ఎక్కడకు వెళ్ళినా సాంప్రదాయబద్దంగా కనిపిస్తుంది. మెడలో నల్లపూసలతో దర్శనమిస్తోంది. గ్లామర్ లుక్ ని పూర్తిగా వదిలేసింది అని చెప్పలేం కానీ, ప్రస్తుతం అయితే ట్రెడిషనల్ గానే కనిపిస్తుంది.


తాజాగా సామ్.. ది నోడ్ మ్యాగజైన్ కోసం ఫోటోషూట్ చేసింది. ఒకప్పుడు అమ్మడు చేసిన మ్యాగజైన్ ఫోటోషూట్స్ కంటే ఈసారి బిన్నంగా ఎలాంటి స్కిన్ షో చేయకుండా సామ్ కనిపించింది. అయితే ఈ ఫోటోషూట్ లో ఉన్న సామ్ ని ఫ్యాన్స్ ని గుర్తుపట్టలేకపోతున్నారు. మయోసైటిస్ వచ్చినప్పుడు ఎంత బక్కగా ఉండేదో.. ఇప్పుడు కూడా ఆమె అలాగే కనిపించింది. ఆ ఫోటో యాంగిల్స్ కూడా దగ్గరనుంచి తీయడంతో సామ్ మరింత బక్కచిక్కి కనిపించింది. దీంతో ఎవరీమె.. ఇలా ఉందేంటి అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. పెళ్ళి అయ్యాకా ఏ అమ్మాయి ముఖంలోనైనా గ్లామర్ పెరిగి, మరింత అందంగా కనిపిస్తారు. కానీ, సామ్ ఏంటి ఈ ఫోటోషూట్ లో ఇలా ఉంది. అసలు ఈమె సమంతానేనా అని ప్రశ్నిస్తున్నారు.


ఇక సామ్ సినిమాల విషయానికొస్తే.. నందినిరెడ్డి దర్శకత్వంలో మా ఇంటి బంగారం సినిమా చేసింది. అన్ని బావుంటే బంగారం మే 15 న రిలీజ్ అయ్యేది. కానీ, కొన్ని కారణాల వలన ఈ సినిమా జూన్ కి వాయిదా పడింది. మరి ఈ సినిమాతో సామ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Updated Date - May 09 , 2026 | 01:28 PM