Prabhas: ఇక నువ్వొక్కడివే మిగిలావ్ అన్నా..
ABN, Publish Date - Feb 02 , 2026 | 03:58 PM
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే టక్కున ప్రభాస్ (Prabhas) అని చెప్పేస్తారు. ఈ ఏడాది.. వచ్చే ఏడాది.. ఇలా ప్రతి ఏడాది ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడు అని అభిమానులు ఆశలు పెట్టుకుంటున్నారు
Prabhas: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే టక్కున ప్రభాస్ (Prabhas) అని చెప్పేస్తారు. ఈ ఏడాది.. వచ్చే ఏడాది.. ఇలా ప్రతి ఏడాది ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడు అని అభిమానులు ఆశలు పెట్టుకుంటున్నారు. కానీ, అది అవ్వకపోయేసరికి నిరాశచెందుతున్నారు. వేరే హీరో ఎవరైనా పెళ్లి చేసుకున్నా.. తండ్రి అయినా ఆ నిరాశను మరింతగా వ్యక్తం చేయడం ఫ్యాన్స్ కి అలవాటుగా మారిపోయింది. ఇప్పుడు మరోసారి ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశను వ్యక్తం చేస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) రెండోసారి తండ్రి అయిన విషయం తెల్సిందే. మెగా కోడలు ఉపాసన జనవరి 31 న కవలపిల్లలకు జన్మనిచ్చారు. దీంతో మెగా ఇంట సంబరాలు అంబరాన్ని అంటాయి.
ముగ్గురు పిల్లలకు రామ్ చరణ్ తండ్రి అయ్యాడు. అప్పుడే పుట్టిన బిడ్డను ఎత్తుకొని తండ్రి ఫీల్ అయ్యే ఎమోషన్ ని వర్ణించడానికి మాటలు ఉండవు. అలాంటి క్షణం టాలీవుడ్ హీరోలందరి జీవితంలో వచ్చింది. పవన్ కళ్యాణ్ దగ్గరనుంచి నిఖిల్, నితిన్ వరకు.. అంతెందుకు రెండేళ్ల క్రితం పెళ్ళైన వరుణ్ తేజ్ కూడా ఒక బిడ్డకు తండ్రి అయ్యాడు. కానీ, ఒక్క ప్రభాస్ మాత్రమే ఇంకా పెళ్లి వరకు కూడా వెళ్ళలేదు. ఇప్పుడు అదే విషయమై ప్రభాస్ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అనేది ఒక మిస్టరీగా మారిపోయింది. ప్రస్తుతం ఆయన వయస్సు 46. ఇప్పటివరకు పెళ్లి గురించి డార్లింగ్ ఏ విషయాన్నీ అధికారికంగా చెప్పలేదు. కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అన్న మాట తప్ప.. ఆయన నుంచి ఎలాంటి వార్త లేదు. దీంతో ఫ్యాన్స్.. తమ హీరో కన్నా చిన్నవారు కూడా పెళ్ళి చేసుకొని.. తండ్రి అవుతున్నారు. వారి ఫ్యాన్స్ వారసుడు వచ్చాడు అంటూ పండగ చేసుకుంటున్నారు. కానీ, తమకు మాత్రం ఆ క్షణం ఎప్పుడొస్తుందో అని ఎదుచూస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
ప్రభాస్ ఈ ఏడాది అయినా పెళ్లి చేసుకోవాలని కోరుతూ.. ఇండస్ట్రీలో నువ్వొక్కడివే మిగిలేవి అన్నా.. అంటూ మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు ఇంకోపక్క కొంతమంది ఫ్యాన్స్ అయితే ఏఐ ద్వారా అనుష్కతో ప్రభాస్ పెళ్లి అయ్యినట్లు, వారికి ఒక బాబు కూడా జన్మించినట్లు ఫోటోలు ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మరి ఫ్యాన్స్ ఆవేదనను అర్ధం చేసుకొని డార్లింగ్ ఈ ఏడాది అయినా పెళ్లి పీటలు ఎక్కుతాడేమో చూడాలి.