సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అయ్యా.. ఒక్క అప్డేట్ అయినా ఇవ్వండయ్యా!

ABN, Publish Date - Apr 14 , 2026 | 07:27 PM

ఇటీవ‌ల బ‌య‌ట‌య‌కు వ‌చ్చిన‌ ఎన్టీఆర్ న్యూ లుక్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేలా సోషల్ మీడియాను ఊపేస్తోంది.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR), స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబోలో తెరకెక్కుతున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ డ్రాగన్ (Dragon) కోసం మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేలా ఎన్టీఆర్ న్యూ లుక్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. కండలు తిరిగిన దేహంతో, క్లాసిక్ బ్యాక్ డబుల్ బైసెప్స్ ఫోజులో ఎన్టీఆర్ ట్రాన్సఫర్మేషన్ అద్భుతంగా ఉంది. ఈ పవర్ ఫుల్ రోల్ కోసం ఆయన కఠినమైన శిక్షణతో పాటు సరైన డైట్ తీసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. జిమ్‌లో ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోను షేర్ చేస్తూ 'బిల్ట్... నాట్ బాట్' అంటూ ఆయన ఇచ్చిన క్యాప్షన్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

ఎన్టీఆర్ లుక్ విషయంలో అసంతృప్తి వల్ల షూటింగ్‌కు బ్రేక్ పడిందంటూ గత కొద్దిరోజులుగా సాగుతున్న ప్రచారాన్ని చిత్ర యూనిట్ గట్టిగా ఖండించింది. ఆ వార్తల్లో వాస్తవం లేదని, రెగ్యులర్ సన్నాహాల కోసం తీసుకున్న చిన్న విరామం తప్ప షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు లేదని నిర్మాతలు స్పష్టం చేశారు. ఇప్పటికే జోర్డాన్‌లో కీలక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, రీసెంట్‌గా శంషాబాద్ సమీపంలోని ఒక ఆలయంలో వారం రోజుల పాటు షూటింగ్ జరుపుకుంది. తదుపరి షెడ్యూల్ కోసం భారీ సెట్లను నిర్మిస్తుండగా, త్వరలోనే కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది.

మరోవైపు మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో, 'డ్రాగన్' టీమ్ నుంచి ఏదైనా భారీ గ్లింప్స్ లేదా వీడియో వస్తుందని ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే వీడియో అప్‌డేట్ వచ్చే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయని టాక్. కేవలం ఒక స్పెషల్ పోస్టర్ లేదా టైటిల్ డిజైన్ రిలీజ్ చేసి సరిపెట్టే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇది అభిమానులను కొంత నిరాశకు గురిచేసే విషయమే అయినప్పటికీ, నాణ్యత విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే చిత్ర బృందం ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

దర్శకుడు ప్రశాంత్ నీల్ తన సినిమాల విషయంలో డెడ్ లైన్స్ కంటే క్వాలిటీకే ప్రాధాన్యత ఇస్తుంటారు. ఒత్తిడిలో పనిచేయడం కంటే, అనుకున్న విజన్ తెరపై వచ్చేలా చూసుకోవడమే ఆయన శైలి. ఇదే విషయాన్ని ఆయన మైత్రి మేకర్స్ నిర్మాతలకు కూడా స్పష్టం చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ కారణంగానే రిలీజ్ డేట్ గురించి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం నడుస్తున్న చిత్రీకరణ వేగాన్ని పరిశీలిస్తే, ఈ ఏడాది రావాల్సిన దసరా, దీపావళి సీజన్లు కూడా దాటిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. జాప్యం జరుగుతున్నప్పటికీ, ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ కలయికలో వచ్చే అవుట్‌పుట్ అంచనాలకు మించి ఉంటుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి అభిమానుల ఓపికకు తగ్గట్టుగా నీల్ ఎలాంటి సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తారో వేచి చూడాల్సిందే.

Updated Date - Apr 14 , 2026 | 07:44 PM