అబ్బే.. ఇంకా డాన్ లీ మీద ఆశ చావలేదు!
ABN, Publish Date - Mar 01 , 2026 | 06:32 PM
టాలీవుడ్ తో పాటు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న సినిమాల్లో స్పిరిట్ (Spirit) ఒకటి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా, సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో త్రిప్తి డిమ్రి (Triptii Dimri) హీరోయిన్ గా నటిస్తోంది.
టాలీవుడ్ తో పాటు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న సినిమాల్లో 'స్పిరిట్' (Spirit) ఒకటి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా, సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో త్రిప్తి డిమ్రి (Triptii Dimri) హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి కొరియన్ నటుడు డాన్ లీ ( Donlee)నే విలన్ అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ వచ్చింది. ప్రభాస్ - డాన్ లీ మధ్య జరిగే యుద్దాన్ని ఏఐ ద్వారా క్రియేట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఖచ్చితంగా డాన్ లీ 'స్పిరిట్' లో భాగం అవుతారని అందరూ ఎంతో ఆశగా ఎదురుచూశారు. అయితే ఆ ఆశల మీద వంగా నీళ్లు చల్లారు. 'స్పిరిట్' లో డాన్ లీ విలన్ కాదని తేల్చి చెప్పారు. ఇటీవలే 'స్పిరిట్' లో విలన్ గా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
అసలు 'స్పిరిట్' మొదలు కానప్పటి నుంచి డాన్ లీ పేరు సోషల్ మీడియాను షేక్ చేస్తూ వచ్చింది. ఒక కొరియన్ నటుడిని తెలుగు ప్రేక్షకులు ఈ రేంజ్ లో అభిమానిస్తారు అన్న విషయం కూడా డాన్ లీని చూశాకే అర్థమైంది. ప్రభాస్ సినిమాలో నటిస్తున్నాడు అనే ఒక్క వార్తతో తెలుగునాట అతని పేరు మారుమ్రోగిపోయింది. కానీ , చివరకు అది నిజం కాకుండా పోయింది. అయినా అభిమానుల్లో మాత్రం ఇంకా ఆశ చావలేదు. వంగా ఎలాగైనా డాన్ లీని తీసుకొస్తారని అభిమానులు ఎదురుచూస్తూనే ఉన్నారు.
వివేక్ ఒబెరాయ్ మంచి నటుడు. తెలుగులో కూడా 'రక్త చరిత్ర, వినయ విధేయ రామ' లాంటి సినిమాల్లో నటించారు. తెలుగు ప్రేక్షకులకు ఆయన సుపరిచితమే. వంగా లాంటి డైరెక్టర్ .. ప్రభాస్ కు పోటీగా వివేక్ ని దింపుతాడని ఫ్యాన్స్ అనుకోలేదు. 'యానిమల్' కోసం బాబీ డియోల్ లాంటి ఒక స్టార్ హీరోని విలన్ గా మార్చి సర్ ప్రైజ్ చేసిన వంగా.. ప్రభాస్ కోసం డాన్ లీ లాంటి స్టార్ నే ఎంపిక చేస్తారని అనుకున్నారు. కానీ, అది జరగలేదు. కనీసం ఇప్పుడైనా డాన్ లీ.. 'స్పిరిట్' లో ఉన్నారా..? లేదా.. ? అనేది క్లారిటీ ఇస్తే ఆశలు పెట్టుకోవాలా.. ? వద్దా.. ? అనేది ఫ్యాన్స్ డిసైడ్ చేసుకుంటారని కొందరు అంటున్నారు. మరి సందీప్ రెడ్డి వంగా డాన్ లీ విషయంలో ఒక క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.