సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

మంగ్లీపై అసత్య ప్రచారం.. అసభ్యకర పోస్టులు చేస్తున్నారు

ABN, Publish Date - Apr 29 , 2026 | 07:19 AM

సింగర్ మంగ్లీ (Singer Mangli)ని టార్గెట్ చేసుకొని కొన్ని యూటూబ్ చానెల్స్ అసభ్యకర పోస్టులు పెడుతున్నాయని ఆమె పర్సనల్ మేనేజర్ మేగ్ రాజ్ ఆరోపించారు.

mangli

ప్రముఖ సింగర్ మంగ్లీ (Singer Mangli)ని టార్గెట్ చేసుకొని కొన్ని యూటూబ్ చానెల్స్ అసభ్యకర పోస్టులు పెడుతున్నాయని ఆమె పర్సనల్ మేనేజర్ మేగ్ రాజ్ ఆరోపించారు. మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

మంగ్లీపై కొన్ని యూట్యూబ్ చానెల్స్ అసత్య ప్రచారం చేస్తున్నాయని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆమెతో పాటు కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. బాధితులకు అండగా ఉంటానని మంగ్లీ హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఆమెపై గ్లోబల్ ప్రచారాన్ని మానుకోవాలని, త్వరలో నిజాలు తెలుస్తాయన్నారు. సమావేశంలో నవీన్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 29 , 2026 | 07:19 AM