రాజమౌళి కొన్ని సలహాలిచ్చారు: ఫాహద్‌ ఫాజిల్‌

ABN , Publish Date - Sep 27 , 2026 | 02:07 PM

‘తెలుగు వారు నా మీద చూపిస్తున్న అభిమానం గొప్పగా ఉంది. ఏడాదిన్నరగా హైదరాబాద్‌లోనే ఉంటున్నాను. నా చుట్టూ అందరూ తెలుగువారే ఉన్నారు. తెలుగు బాగా అర్థమవుతోంది. త్వరలోనే తెలుగులో మాట్లాడతాను’ అని హీరో ఫాహద్‌ ఫాజిల్‌ అన్నారు.

Fahadh Faasil

‘తెలుగు వారు నా మీద చూపిస్తున్న అభిమానం గొప్పగా ఉంది. ఏడాదిన్నరగా హైదరాబాద్‌లోనే ఉంటున్నాను. నా చుట్టూ అందరూ తెలుగువారే ఉన్నారు. తెలుగు బాగా అర్థమవుతోంది. త్వరలోనే తెలుగులో మాట్లాడతాను’ అని హీరో ఫాహద్‌ ఫాజిల్‌ (Fahadh Faasil) అన్నారు. ఆయన నటించిన ‘డోంట్‌ ట్రబుల్‌ ద ట్రబుల్‌’ (Don't Trouble the Trouble) అక్టోబర్‌ 2న విడుదల కానుంది. ఆర్కా మీడియా వర్క్స్‌, షోయింగ్‌ బిజినెస్‌ బ్యానర్ల మీద శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని, ఎస్‌.ఎస్. కార్తికేయ నిర్మించారు. శశాంక్‌ ఏలేటి దర్శకుడు.


ఈ సినిమా గురించి ఫాహద్‌ ఫాజిల్‌ మాట్లాడుతూ.. ‘‘దర్శకుడు కథ చెప్పగానే నాకు నచ్చింది. చెడు నుంచి మంచి వైపు జరిగే ప్రయాణాన్ని అందరూ ఆస్వాదిస్తారనిపించింది. పెద్దవాళ్లలో ఉన్న పసి మనసును ఈ సినిమా ఆవిష్కరిస్తుంది. మల్టిపుల్‌ జోనర్లలో సాగుతుంది. సారా అద్భుతంగా నటించింది. సినిమాను చాలా వరకు రియల్‌ లొకేషన్లలో చిత్రీకరించాం. తెలుగులో నేనే డబ్బింగ్‌ చెప్పాను. కాలభైరవ సంగీతం సినిమాలో ఓ కేరక్టర్‌లా ఉంటుంది. పక్కా ప్లానింగ్‌తో నిర్మాతలు ఈ చిత్రాన్ని పూర్తి చేసిన తీరు మెప్పించింది. ఈ సినిమా జర్నీలో భాగంగా నందమూరి బాలకృష్ణను కలిశాం. తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఆయన నన్ను ఆహ్వానించిన తీరు మనసును హత్తుకుంది. చిన్నతనం నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను.


రాజమౌళి మా సినిమా ఎడిట్‌ కట్‌ చూసి కొన్ని సలహాలిచ్చారు. ఫైనల్‌ కాపీ చూసి హ్యాపీ అయ్యారు. ఆర్కా మీడియా వర్క్స్‌ సంస్థలో మరో సినిమా చేస్తున్నాను. త్వరలోనే ఆ వివరాలను తెలియజేస్తాము’’ అని అన్నారు. 24ఏళ్ల సినీ జర్నీని గుర్తుచేసుకుంటూ ‘‘నా తొలి చిత్రం ఫ్లాప్‌ కాగానే అమెరికా వెళ్లిపోయాను. దాదాపు ఆరేళ్ల తర్వాత ఇంకొక్క సినిమా చేద్దాం అని ఇండియాకి వచ్చాను. అలాంటిది ఇప్పుడు 66 సినిమాలయ్యాయి’’ అని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

‘ద ప్యారడైజ్’.. 3 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతంటే..

‘రణబాలి’ విడుదలకు ముందే ఓటీటీలోకి.. అసలు విషయమిదే

తెలుగులో థియేట‌ర్ల‌కు.. కీర్తి సురేశ్, స‌నంత్‌ లెస్బియ‌న్ మూవీ

Updated Date - Sep 27 , 2026 | 02:07 PM