బుట్టబొమ్మని సీఎం కూడా కాపాడలేకపోయాడే..
ABN, Publish Date - Jul 24 , 2026 | 07:16 PM
అసలు బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) కెరీర్ ఎటుపోతుందో ఎవరికి అర్ధం కావడం లేదు. మచ్చుకైనా ఆమె ఒక్క హిట్ కొట్టలేకపోతుంది. ఒకటా.. రెండా.. ఇప్పటికీ అరడజనుకు పైగా సినిమాలు.
అసలు బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) కెరీర్ ఎటుపోతుందో ఎవరికి అర్ధం కావడం లేదు. మచ్చుకైనా ఆమె ఒక్క హిట్ కొట్టలేకపోతుంది. ఒకటా.. రెండా.. ఇప్పటికీ అరడజనుకు పైగా సినిమాలు. పోనీ ఒకే భాషలోనా అంటే.. అన్నీ భాషల్లో అమ్మడికి పరాజయమే. సరే.. సీఎం విజయ్ అయినా అమ్మడిని కాపాడాతారేమో అని చూసింది. కానీ, ఆయన కూడా ఆ పని చేయలేకపోయారు. విజయ్ హీరోగా హెచ్. వినోత్ దర్శకత్వంలో తెరకెక్కిన జన నాయగన్ జులై 23 న రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ని అందుకున్న విషయం తెల్సిందే. ఇంకా చెప్పాలంటే తెలుగులో ఈ సినిమా ట్రోలింగ్ బారిన పడింది. అసలు భగవంత్ కేసరి ఎక్కడ.. ఈ జన నాయగన్ ఎక్కడ అని తీసిపడేస్తున్నారు. కనీసం.. భగవంత్ కేసరిని సీన్ టూ సీన్ కాపీ చేసినా కూడా బావుండేదేమో. కథలో ఒక లైన్ ని తీసుకొని.. దానిని ముందు పెట్టి.. వెనుక పొలిటికల్ డ్రామా నడిపేసరికి ప్రేక్షకులకు చిర్రెత్తుకొచ్చింది.
ఇక ఇదంతా పక్కన పెడితే.. ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న బుట్టబొమ్మకు మరోసారి నిరాశే ఎదురయ్యింది. జర్నలిస్ట్ పాత్రలో కనిపించిన పూజా.. ఎప్పుడు వస్తుంది.. ఎప్పుడు పోతుంది అనేది కూడా తెలియలేదు. ముందే డైరెక్టర్ అమ్మడి సీన్స్ ని కట్ చేశారు అని చెప్పడంతో కొంచెం అయినా ఈ ట్రోల్ ఆగింది కానీ, లేకపోతే పాపం పూజా.. క్యామియోలు చేసుకుంటూ బ్రతికేస్తుంది అని చెప్పుకొచ్చేవారు. ఈ సినిమాలో పూజా ఉంది కానీ, ఆమె పాత్రకు మాత్రం ప్రాధాన్యత లేదు. ఇక ఈ సినిమా కూడా పూజా ఖాతాలో ఒక ప్లాప్ అని యాడ్ చేసేస్తున్నారు.
సాధారణంగా ఇన్ని ప్లాప్ లు వస్తే ఆ హీరోయిన్ కెరీర్ మటాష్. ఒక్క స్టార్ హీరో కూడా ఆమెను క్యాస్ట్ చేసుకోడు. కానీ, పూజాకి అలా కాదు. ప్లాప్ లు వస్తూనే ఉన్నాయి.. ఛాన్స్ లు దక్కించుకుంటూనే ఉంది. మరి బుట్టబొమ్మ రేంజ్ అలాంటిది. ప్రస్తుతం అమ్మడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. దుల్కర్ సరసన శ్రీశ్రీ, రాఘవ లారెన్స్ సరసన కాంచన 4, హాసిత్ గోలి వీరాధివీరులంట సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ మిగతా హీరోయిన్లకు షాక్ ఇస్తోంది. మరి ఈ సినిమాల్లో ఏ సినిమా బుట్టబొమ్మకు హిట్ ఇస్తుందో చూడాలంటే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేవరకు ఆగాల్సిందే.