సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అప్పుడు గీతాంజలి, తొలి ప్రేమ, అర్జున్‌ రెడ్డి.. ఇప్పుడు ‘దీవానా’

ABN, Publish Date - Mar 25 , 2026 | 08:56 AM

యువ కథానాయకుడు హర్షిత్‌ రెడ్డి హీరోగా శ్రీకాంత్‌ సంగిశెట్టి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘దీవానా’ .

deewana

యువ కథానాయకుడు హర్షిత్‌ రెడ్డి (Harshith Reddy) హీరోగా శ్రీకాంత్‌ సంగిశెట్టి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘దీవానా’ (Deewana). స్మేహ మణిమేఘలై (Smeha Manimegalai) హీరోయిన్‌. వాసుదేవ్‌ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ‘ఇది ప్రేమ..’ అంటూ సాగే గీతాన్ని హీరోయిన్‌ సమంత సోషల్‌ మీడియా ద్వారా రిలీజ్‌ చేశారు. అనంతరం నిర్వహించిన వేడుకలో దర్శకులు వెంకీ అట్లూరి, రవికిరణ్‌ కోలా, నందినీరెడ్డి అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హర్షిత్‌ రెడ్డి మాట్లాడుతూ ‘నేను షారుఖ్‌ ఖాన్‌ అభిమానిని. ఆయన మొదటి చిత్రం పేరు కూడా 'దీవానా’ అని తెలుసుకున్న తర్వాత ఈ సినిమా నాకు వర్కవుట్‌ అవుతుందనే నమ్మకం కలిగింది. కమల్‌హాసన్‌ గారికి ‘సద్మా’, నాగార్జున గారికి ‘గీతాంజలి’, పవన్‌ గారికి ‘తొలి ప్రేమ’, విజయ్‌ దేవరకొండ గారికి ‘అర్జున్‌ రెడ్డి’ ఎలాగో నాకు ‘దీవానా’ అలా పేరు తెస్తుంది’ అని అన్నారు.

చిత్ర దర్శకుడు శ్రీకాంత్‌ సంగిశెట్టి (Sreekanth Sangishetty) మాట్లాడుతూ ‘ఈ కథ నా దగ్గర చాలా కాలంగా ఉంది. దీన్ని సినిమాగా తీయాలంటే ధైర్యం కావాలి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. కచ్చితంగా ఘన విజయం సాధిస్తుంది. ప్రేక్షకులు చాలా కాలం గుర్తుంచుకునే సినిమాగా మిగిలిపోతుందనే నమ్మకం ఉంది’ అని చెప్పారు.

ఇక పాట విష‌యానికి వ‌స్తే.. చైత‌న్య పింగ‌ళి (Chaithanya Pingali), ఈశ్వ‌ర్ చంద్ సంయుక్తంగా ర‌చించిన ఈ పాట‌కు ఈశ్వ‌ర్ చంద్ (Eswar Chand) సంగీతం అందించ‌గా ప్ర‌ముఖ సింగ‌ర్ కార్తీక్ (Karthik) ఆల‌పించడం విశేషం. ఎప్ప‌టిలానే కార్తీక్ గాత్రం మ‌రోమారు మెస్మ‌రైజింగ్ చేసేలా ఉండ‌గా సాహిత్యం సైతం ప్రెష్‌గా ఉండి ప్రేమికుడి భావాల‌ను లోతుగా వ్య‌క్తప‌రుస్తూ ఉంది. అంతేకాదు.. ఈ పాట చాలాకాలం యూత్‌ ప్లే లిస్ట్‌లో ఉండే అవ‌కాశాలు అధికంగా ఉన్నాయి.

Updated Date - Mar 25 , 2026 | 11:18 AM