సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

వామ్మో.. ఇంత ప‌చ్చిగా ఉందేంటి ఈ పాట‌! లీన‌మైపోయారుగా!!

ABN, Publish Date - Aug 13 , 2026 | 04:36 PM

'కికు చిరంజీవి' చిత్రం నుంచి తాజాగా విడుద‌లైన పాట సామాజిక మాధ్య‌మాల్లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

కికు యనమల (Kiku Yanamala), కాశీష్ ఖాన్ (Kashish Khan) జంటగా నటించిన యూత్‌ఫుల్ రొమాంటిక్‌ చిత్రం కికు చిరంజీవి (Kiku Chiranjeevi). ఈశ్వరరావు, తనికెళ్ళ భరణి, గోపరాజు రమణ, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రధారులు. శుభ సాయి వెంకట్ దర్శకత్వంలో నడిమింటి దీప్తి నిర్మించారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగ‌స్టు28న థియేట‌ర్ల‌లో విడుద‌ల‌కు ముస్తాబవుతోంది. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ ఇప్ప‌టికే విడుద‌ల చేసిన గ్లింప్స్ , టీజ‌ర్ సినీ ప్రియుల్లో అంచ‌నాల‌ను మించి ఆద‌ర‌ణ ద‌క్కించుకుంది. గుండె కుడి వైపున ఉండే ఓ యువ‌కుడి నేప‌థ్యంలో జ‌రిగే ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌క‌థ‌నాల‌తో ఈ చిత్రం తెర‌కెక్కింది.

అయితే సినిమా విడుద‌ల ద‌గ్గ‌ర ప‌డుతున్న క్ర‌మంలో మేక‌ర్స్ తాజాగా ఈ చిత్రం నుంచి 'ఎమో ఏమ‌వునో' (EMO EMAVUNO) అంటూ సాగే రొమాంటిక్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. అప్పుడే కొత్త‌గా పెళ్లి చేసుకున్న జంట మొద‌టి రాత్రి నేప‌థ్యంలో వారి ఊసుల‌ను వ‌ర్ణిస్తూ ఈ పాట సాగింది. ఈ పాట‌కు వ‌న‌మాలి (Vanamali) సాహిత్యం అందించ‌గా, శేఖ‌ర్ చంద్ర (Shekar Chandra) సంగీతంలో రితేశ్ రావు (G Ritesh Rao), ల‌క్ష్మీ మేఘ‌న (Laxmi Meghana) ఆల‌పించారు.

ఇదిలాఉంటే.. 3 నిమిషాల 58 సెకన్ల నిడివి ఉన్న ఈ పాట ఆరంభం నుంచి చివ‌రి వ‌ర‌కు ఫుల్ రొమాంటిక్ మోడ్‌లో సాగుతూ కుర్ర‌కారుకు కిక్ ఇచ్చేలా ఉంది. అంతేకాదు వీక్షించే వారంద‌రికీ సీటులో కూర్చోనీయ‌ని విధంగా ఘాటైన చుంబ‌నాలు, ఇంటిమేట్ స‌న్నివేశాల‌తో ప్ర‌తీ క్ష‌ణం హీట్ పెంచేదిగా ఉంది. ఈ సాంగ్‌ చూసిన వారంతా 'ఇదేంటి ఈ రేంజ్‌లో ఉంది.. ఈ పాటలో అస‌లు హీరో హీరోయిన్లు న‌టించారా లేక జీవించారా?' అని డౌట్ వ్యక్తం చేస్తున్నారు. ఇందులోని ప్రధాన జంట అభిన‌యం, స‌న్నివేశాలు ఆ స్థాయిలో ఉన్నాయి. ప్ర‌స్తుతం ఈ సాంగ్ సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది. మీరూ ఆ పాట‌పై లుక్ వేయండి... ఇంకా ఆల‌స్యం ఎందుకు!?

Updated Date - Aug 13 , 2026 | 04:44 PM