సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Bhogi: ఏముందిరా పాట‌.. ఆహా! మేదారి న‌ర్స‌న్న‌, క‌మ్మారి గంగ‌న్న, గొల్లోళ్ళ సులోచన

ABN, Publish Date - Oct 09 , 2026 | 04:18 PM

ఛార్మింగ్ స్టార్ శ‌ర్వానంద్, అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంట‌గా సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న చిత్రం భోగి.

Bhogi

ఛార్మింగ్ స్టార్ శ‌ర్వానంద్ (Sharwanand), అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్ (Anupama) జంట‌గా సంప‌త్ నంది (Sampath Nandi) ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న చిత్రం భోగి (Bhogi). దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ఎదుట‌కు వ‌చ్చేందుకు సిద్ధ‌మ‌యింది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి విడుద‌ల చేసిన పోస్ట‌ర్స్‌, గ్లింప్స్, టీజ‌ర్ ప్రేక్ష‌కుల నుంచి అద‌రిపోయే రెస్పాన్స్ ద‌క్కించుకోగా తాజాగా ఈ చిత్రం నుంచి ఎగిలి వారంగా లేచి ( Egili Varanga Lyrical Video) అంటూ ఓ స్వచ్ఛమైన, సహజమైన తెలంగాణ నేప‌థ్యంలో సాగే పాట‌ను విడుద‌ల చేశారు.

ఆస్కార్ విన్న‌ర్ చంద్ర‌బోస్ (Chandrabose) ఈ గేయానికి అద్భుత‌మైన సాహిత్యం అందించ‌గా భీమ్స్ (Bheems Ceciroleo) సంగీతంలో న‌ల్ల‌గొండ గ‌ద్ద‌ర్ న‌ర్సిరెడ్డి (Nalgonda Gaddar Narsanna), కందుకూరి శంక‌ర్ బాబు (Kandukuri Shankar Babu), రేలారే గోపాల్ (Relare Gopal) ఆల‌పించారు. ఓ మారుమూల ప‌ల్లెలో దేశ్‌ముఖ్ (ప‌టేల్‌) క‌నుస‌న్న‌ల్లో కాలం వెళ్ల‌దీస్తున్న స‌మీప గ్రామ ప్ర‌జ‌లు, అక్క‌డి వారు త‌మ దైనందిన కార్య‌క్ర‌మాన్ని వివరిస్తూ సాగింది.

అంతేగాక పాట అంతా విన‌సొంపుగా, అర్థ‌వంతంగా సాగుతూ చివ‌ర‌లో వ‌చ్చే లిరిక్స్ మాత్రం మ‌రో లెవ‌ల్‌లో ఉన్నాయి. ఆ చివ‌రి లైన్స్ తెలంగాణ‌లో నాటి దురాగ‌తాల‌ను, ప్ర‌జ‌ల బానిస‌త్వాన్ని మాట‌ల‌తోనే క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపారు. మేదారి న‌ర్స‌న్న‌ బుట్ట‌లు, త‌ట్టాలు తేవంగా, క‌మ్మారి గంగ‌న్న క‌త్తులు, కొడ‌వ‌ళ్లు తేవంగా, చాక‌లి, మాదిగ‌, గొల్లోళ్ళ సులోచన - కమ్మరోళ్ళ గంగ అంటూ అన్ని వృత్తులను గుర్తు చేస్తూ వాటిని తెర‌పై చూపిస్తూ నాటి కాలానికి తీసుకెళ్లారు. అంతేగాక గ‌తంలో ఎక్కువ‌గా వ‌చ్చిన‌ పాత ఆర్. నారాయ‌ణ మూర్తి సినిమాల్లోని పాట‌ల‌ను జ్ఞ‌ప్తికి తెచ్చారు.

Updated Date - Oct 09 , 2026 | 05:31 PM