సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా.. బండ్లన్న మళ్లీ స్టార్ట్ చేశాడ్రోయ్

ABN, Publish Date - Sep 02 , 2026 | 02:01 PM

పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు (సెప్టెంబర్ 2) సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు, జనసేన శ్రేణులు పండుగ వాతావరణంలో సంబరాలు చేసుకుంటున్నారు.

Bandla Ganesh and Pawan Kalyan

పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పుట్టినరోజు (సెప్టెంబర్ 2) సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు, జనసేన శ్రేణులు పండుగ వాతావరణంలో సంబరాలు చేసుకుంటున్నారు. సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా డిప్యూటీ సీఎం (AP Deputy CM)కు శుభాకాంక్షల వెల్లువ కురిపిస్తున్నారు. అయితే, పవన్ కళ్యాణ్ బర్త్‌డే అంటే అందరి కళ్లూ ఎదురుచూసేది ఒక్కరి ట్వీట్ కోసమే.. ఆయనే ప్రముఖ నిర్మాత, పవన్ వీరాభిమాని బండ్ల గణేష్ (Bandla Ganesh)! గతంలో పవన్ కళ్యాణ్ మూవీ ఆడియో ఫంక్షన్లలో బండ్లన్న ఇచ్చిన స్పీచ్‌లు, డైలాగులు ఏ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేశాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు పవన్ పుట్టినరోజు సందర్భంగా బండ్ల గణేష్ పెట్టిన సుదీర్ఘమైన, ఎమోషనల్ ట్వీట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తన మార్క్ భక్తిని చాటుకుంటూ బండ్లన్న చేసిన పోస్ట్ చూసి ‘బండ్లన్న మళ్లీ పూనకాలతో పూనకేశ్వరుడిగా మారాడు’ అంటూ నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.


ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌ను ఆకాశానికెత్తుతూ బండ్ల గణేష్ రాసిన పదాలు అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. ‘‘ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా.. మీ పేరు వింటే పూనకం… మీ పేరు వింటే పులకం… మీ రూపం చూస్తే పులకింత… మీ మాట వింటే ధైర్యం… మీ అడుగు పడితే సంచలనం! మీరు కేవలం ఒక హీరో మాత్రమే కాదు… కోట్లాది మందికి ఒక బలమైన భావోద్వేగం. మీరు ఒక స్టార్ కాదు… నడిచే ఒక అద్భుత శక్తి. మీరు ఒక సాధారణ పేరు కాదు… కోట్లాది హృదయాల్లో ఎప్పటికీ చెరగని ముద్ర. మీ శిష్యుడిగా మిమ్మల్ని అభిమానించడం నా పూర్వజన్మ సుకృతం, అదృష్టం. మీ పేరును గర్వంగా పలకడం నాకు దక్కిన గొప్ప గౌరవం’’ అంటూ పవన్ కళ్యాణ్‌పై తనకున్న భక్తిని, ప్రేమను అక్షరాల్లో ఆవిష్కరించారు.


అంతేకాకుండా పవన్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ.. ‘‘మీరు ఎల్లప్పుడూ క్షేమంగా, ఆయురారోగ్యాలతో, ఎనలేని సంతోషంతో ఉండాలి. జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ, విజయాలతో నిరంతరం వెలుగుతూ ఉండాలి. మీ కీర్తి ప్రతిష్టలు శాశ్వతంగా చరిత్రలో నిలవాలి. మా పవర్ స్టార్, గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు’’ అని తెలుపుతూ.. చివర్లో మళ్లీ తనదైన శైలిలో ‘ఈశ్వరా… పవనేశ్వరా… పవరేశ్వరా…!’ అంటూ ముగించారు. ‘గబ్బర్ సింగ్’ సినిమా సమయం నుంచి పవన్‌ను ‘దేవుడు’ అంటూ కొలిచే బండ్ల గణేష్, నేడు ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నా కూడా అదే విధేయతను, పిచ్చి ప్రేమని చాటుకోవడం జనసైనికులను, పవన్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం బండ్లన్న చేసిన ఈ వైరల్ ట్వీట్ నెట్టింట టాప్‌లో ట్రెండింగ్‌ అవుతూ దూసుకుపోతోంది.

ఇవి కూడా చదవండి:

పవన్ కళ్యాణ్ బర్త్ డే అంటేనే పండ‌గ‌.. ఈసారి మునుపటి కంటే మిన్నగా

Chiranjeevi: సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు.. త‌మ్ముడికి చిరు స్పెష‌ల్ బ‌ర్త్‌డే విషెస్‌

Rana: హీరో కాదు.. దర్శకుడే ఇప్పుడు స్టార్ బ్రాండ్!

Updated Date - Sep 02 , 2026 | 02:01 PM