కల్కి సీక్వెల్‌లో క్రేజీ ట్విస్ట్.. మళ్లీ సీన్‌లోకి దుల్కర్ సల్మాన్
ABN, Publish Date - Sep 28 , 2026 | 05:14 PM
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన విజువల్ వండర్ కల్కి 2898 AD ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే.
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన విజువల్ వండర్ కల్కి 2898 AD ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. సైన్స్ ఫిక్షన్, పురాణాల కలయికతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించింది. కల్కిగా ప్రభాస్..నటనకు ఫ్యాన్స్ ఫిధా అయ్యారు. ఇక ఇప్పుడు అందరి దృష్టి ఈ సినిమా సీక్వెల్ అయిన కల్కి 2 పైనే నెలకొంది. ఈ సీక్వెల్‌కి సంబంధించి రోజుకో ఆసక్తికరమైన వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి ఒక క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సెకండ్ పార్ట్ లో కూడా దుల్కర్ సల్మాన్ కీలక పాత్రలో కనిపించనున్నాడట.
కల్కి మొదటి భాగంలో మలయాళ వర్సటైల్ హీరో దుల్కర్ సల్మాన్ కెప్టెన్ పాత్రలో కనిపించాడు. భైరవను పెంచిన పెంపుడు తండ్రి పాత్రలో అతిథి పాత్రలో మెరిసి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. అయితే పార్ట్-1 లో ఆయన కనిపించింది కొన్ని నిమిషాలే అయినప్పటికీ, కథాగమనంలో ఆ పాత్ర ఎంతో కీలకమైనదిగా నిలిచింది. కాగా, ఇప్పుడు రాబోయే సీక్వెల్ కల్కి 2 లో కూడా దుల్కర్ సల్మాన్ నటించబోతున్నారని పరిశ్రమ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది
పార్ట్-2 లో దుల్కర్ సల్మాన్ పాత్రకు సంబంధించిన మరికొన్ని కీలక సన్నివేశాలను నాగ్ అశ్విన్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా భైరవ గతానికి సంబంధించిన ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో కెప్టెన్ పాత్ర నిడివి మరింత ఎక్కువగా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ - దుల్కర్ మధ్య సీన్స్ పీక్స్ ఉండబోతున్నాయట. తొలి భాగంలో వదిలేసిన కొన్ని కీలకమైన ముడులను సీక్వెల్‌లో దుల్కర్ పాత్ర ద్వారానే విప్పబోతున్నాడని టాక్. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్న ఈ సీక్వెల్‌లో దుల్కర్ సల్మాన్ మళ్లీ కనిపించనుండటంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ సీక్వెల్ షూటింగ్ త్వరలోనే మరింత వేగవంతం కానుంది. మరి ఈ సినిమాతో ప్రభాస్ ఎన్ని రికార్డులు తిరగరాస్తాడో చూడాలి.