సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Radhe Radhe: దుల్క‌ర్.. తెలుగు పాట కూడా పాడేశాడుగా

ABN, Publish Date - Nov 02 , 2026 | 01:08 PM

దుల్కర్‌ సల్మాన్ హీరోగా పవన్‌ సాదినేని తెరకెక్కించిన‌ చిత్రం ‘ఆకాశంలో ఒక తార'. ఈ సినిమా నుంచి తాజాగా విడుద‌ల చేసిన స్పెషల్‌ వీడియో అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది.

Dulquer Salmaan,

దుల్కర్‌ సల్మాన్ (Dulquer Salmaan) హీరోగా పవన్‌ సాదినేని (Pavan Sadineni) తెరకెక్కించిన‌ చిత్రం ‘ఆకాశంలో ఒక తార’ (Aakasamlo Oka Tara). గీతా ఆర్ట్స్ (Geetha Arts), స్వప్న సినిమా (Swapna Cinema), లైట్‌ బాక్స్‌ మీడియా (Lightbox Media) బ్యానర్లపై సందీప్‌ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్నారు. సాత్విక వీరవల్లి (Satvika Veeravalli) కథానాయిక. శ్రుతి హాసన్ (Shruti Haasan), రుహానీ శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి విడుద‌ల చేసిన‌ ‘రాధే రాధే’ (Radhe Radhe Lyrical) పాట యూట్యూబ్‌లో దూసుకెళుతుంది. శ్రీమ‌ణి (Sreemani) ఈ పాట‌కు సాహిత్యం అందించ‌గా జీవీ ప్ర‌కాశ్ కుమార్ (G. V. Prakash Kumar) స్వీయ సంగీతంలో లిప్సిక భాష్యం (Lipsika Bhashyam) తో క‌లిసి ఆల‌పించారు.

అయితే రీసెంట్‌గా ఈ పాట‌కు సంబంధించి మేక‌ర్స్ విడుద‌ల చేసిన స్పెషల్‌ వీడియో అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. సంగీత దర్శకుడు జీవిప్రకాశ్‌తో కలిసి దుల్కర్‌ ఈ పాటను స్వయంగా ఆలపించడంతో ఈ వీడియోకు క్రేజీ రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ సంద‌ర్భంగా జీవీ అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు దుల్క‌ర్ స‌మాధానాలు ఇచ్చారు. కాగా ఈ నెల 20న సినిమా థియేట‌ర్ల‌లో విడుదలవుతోంది.

Updated Date - Nov 02 , 2026 | 01:14 PM