DQ41; శ్రీశ్రీ అంటున్న దుల్కర్.. పేరుతోనే హిట్ కొట్టాడుగా
ABN, Publish Date - Jul 10 , 2026 | 10:39 AM
వరుస చిత్రాలతో దూసుకెళుతున్న సౌత్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా డీ41 చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
వరుస చిత్రాలతో దూసుకెళుతున్న సౌత్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరోగా డీ41 చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రవి నెలకుడితి (Ravi Nelakuditi) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సక్సెస్ ఫుల్ నిర్మాత సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) తన ప్రతిష్టాత్మక ఎస్‌ఎల్‌వీ సినిమాస్ (SLV Cinemas,) బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత పూజా హెగ్డే (Pooja Hegde) టాలీవుడ్‌లో కథానాయికగా చేస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుపుకుంటోంది.
అయితే.. తాజాగా మేకర్స్ ఈ మూవీ టైటిల్ రిలీజ్ చేసక్తూ ఓ అప్డేట్ ఇచ్చారు. సినిమాకు శ్రీ శ్రీ (Sri Sri) లవ్ విల్ స్పార్క్ అగైన్ (Love Will Spark Again) అనే పేరు ఖరారు చేసినట్లు ప్రటించారు. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్ సైతం చాలా ఎగ్జైటింగ్‌గా ఉండి చూడ ముచ్చటగా ఉంది. అంతేగాక శ్రీ శ్రీ అనే పేరు చాలా పవర్‌పుల్‌గా ఉండి క్షణాల్లోనే జనాల్లోకి వెళ్లి పోయింది. మీరూ ఈ పోస్టర్‌పై ఓ లుక్ వేయండి మరి.