సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఓనం ఫెస్టివల్‌కు దుల్కర్ సల్మాన్ ఇచ్చే ట్రీట్ ఇదే..

ABN, Publish Date - Jun 15 , 2026 | 11:20 PM

దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తోన్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘ఐ యామ్ గేమ్’. తాజాగా ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

I Am Game Movie Update

దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరోగా నటిస్తోన్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘ఐ యామ్ గేమ్’ (I Am Game). తాజాగా ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్‌లో దుల్కర్ సల్మాన్ స్టైలిష్ అవతార్‌లో కనిపిస్తూ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశారు. ఈ చిత్రాన్ని 2026, ఆగస్ట్ 20న ఓనం కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ప్రస్తుతం చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దుల్కర్ సల్మాన్ సొంత నిర్మాణ సంస్థ వేఫరర్ ఫిల్మ్స్ (Wayfarer Films) నిర్మిస్తోన్న ఈ భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్, ఆయన కెరీర్‌లోనే అత్యంత భారీ చిత్రంగా రూపొందుతోంది.


నహాస్ హిదాయత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్ కలిసి నిర్మిస్తుండగా.. షహబాస్ రషీద్, ఆదర్శ్ సుకుమారన్ కథా రచన, స్క్రీన్‌ప్లే అందించారు. దక్షిణ భారతదేశంలోని వందకు పైగా లొకేషన్స్‌లో చిత్రీకరించిన ఈ చిత్రం.. ప్రస్తుతం మలయాళ సినీ పరిశ్రమలోనే అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టులలో ఒకటి. ఇండస్ట్రీలోనే భారీ నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ తన కెరీర్‌లో ఇప్పటివరకు కనిపించని అత్యంత స్టైలిష్, మాస్ అవతార్‌లో కనిపించబోతున్నారు.


మెగా బ్లాక్‌బస్టర్ ‘లోక: చాప్టర్ 1’ తర్వాత వేఫరర్ ఫిల్మ్స్ నుంచి రాబోతోన్న ప్రతిష్టాత్మక చిత్రమిది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ అద్భుతమైన స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. దుల్కర్ సల్మాన్ కెరీర్‌లో 40వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్‌లో ఆంటోని వర్గీస్, మిస్కిన్, కయాదు లోహర్, కతిర్, పార్థ్ తివారి, సంయుక్త విశ్వనాథన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బ్లాక్‌బస్టర్ ‘ఆర్డీఎక్స్’ తర్వాత నహాస్ హిదాయత్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో పాన్-ఇండియా స్థాయిలో ఈ సినిమా గ్రాండ్‌గా విడుదలకానుంది.

ఇవి కూడా చదవండి:

మెగా రికార్డ్.. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఫస్ట్ టైమ్!

సాయి పల్లవి అనుకున్నప్పుడు ఆ సీన్స్ లేవు: ‘మా ఇంటి బంగారం’ టీమ్‌తో చిట్ చాట్

ఎయిర్ పోర్ట్‌లో వడ్డే నవీన్ పరపతి చూసి షాకయ్యా: వివి వినాయక్

Updated Date - Jun 15 , 2026 | 11:20 PM